క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి అంటే తెలియని వాళ్లు బహుశా భారత క్రికెట్ అభిమానుల్లో ఎవ్వరూ ఉండకపోవచ్చు. సచిన్ రిటైర్మెంట్ వరకు టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్‌లో అతను స్టాండ్స్‌లో దర్శనమిచ్చే వాడు. ఇంటా, బయటా అన్న తేడా లేకుండా సచిన్ ఆడిన ప్రతి మ్యాచ్‌ను చూసేందుకు.. ఆస్తులను సైతం అమ్ముకున్నాడు. కొన్ని సందర్భాల్లో బీసీసీఐయే అతనికి ప్రత్యేక రాయితీలు కల్పించి మ్యాచ్ వీక్షించేందుకు పంపేది. ఇవన్నీ అతనికి ఊరికే రాలేదు. దాని కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో అతడే సొంత మాటల్లో వివరించాడు.
ప్రస్తుతం రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్ జట్టుకు సచిన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. 49 ఏళ్ల వయసులోనూ బ్యాట్ తో ఆనాటి మెరుపులు మెరిపిస్తూ అభిమానులను మరోసారి అలరిస్తున్నాడు. ఈ క్రమంలో సెమీ ఫైనల్ కు అర్హత సాధించిన ఇండియా లెజెండ్స్ జట్టు, ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో పోరులో తలపడింది. ఈ తరుణంలో మ్యాచ్ చూడటానికి సచిన్ వీరాభిమాని సుధీర్ ఎప్పటిలాగే అక్కడకి చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మాస్టర్‌కు వీరాభిమానిగా ఎలా మారాడు? తొలిసారి ఎప్పుడు కలిశాడు? వంటి వివరాలను చెప్పుకొచ్చాడు.
Sudheer die hard fan of Sachin Tendulkar @sachin_rt
— Waadaplaya!!! 🏏 (@waadaplaya) April 23, 2022
సచిన్‌ను మొదటిసారి ముంబయిలోనే కలిశానని చెప్పిన సుధీర్.. ఒక జర్నలిస్ట్ ఇచ్చిన సలహాతోనే అతనిపై మక్కువ పెంచుకున్నట్లు తెలిపాడు. అలా సచిన్ పై ఇష్టం పెరిగాక.. సచిన్‌ను చూడాలనిపించి బిహార్‌లోని ముజఫర్‌పుర్ నుంచి జంషెద్‌పుర్ వరకు రెండు సార్లు సైకిల్‌పై వెళ్లినట్లు తెలిపాడు. ఆ ప్రయాణం దాదాపు 500 కి.మీ. అట. కానీ ఆ సమయంలో మాస్టర్ అనారోగ్యం పాలవ్వడం వల్ల కలవలేకపోయాను అని తెలిపాడు.
The class of Sachin Tendulkar at the age of 49. pic.twitter.com/vqp4OWtwSC
— Johns. (@CricCrazyJohns) September 29, 2022
“సచిన్ ఆడిన ప్రతి మ్యాచ్ చూశాను. భారత్‌లోనే కాకుండా పాకిస్థాన్.. లాహోర్‌కు వెళ్లి కూడా దాయాది జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను చూశాను. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ దేశాలకు వెళ్లి కూడా భారత జట్టుకు మద్దతు తెలిపాను. ఇప్పటికీ భారత జట్టుకే.. నా పూర్తి మద్దతు. సచిన్ రిటైర్మెంట్ ప్రకటించాక.. ఇప్పుడు రోడ్ సేఫ్టీ సిరీస్ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. దీంతో ఇప్పుడు మరోసారి స్టేడియానికి వెళ్లి అతడికి మద్దతు తెలిపే అవకాశం నాకు లభించింది. అందుకు చాలా సంతోషంగా ఉంది” అని సుధీర్ తెలిపాడు.
𝗕𝗮𝗰𝗸𝗳𝗼𝗼𝘁 𝗣𝘂𝗻𝗰𝗵 😍🙌🔟🏏 That’s beautifully played !! Sachin tendulkar played from the crease 💙@sachin_rt turning back the clock again🕰️🔄 #loop#RoadSafetyWorldSeries #sachintendulkar #GOAT #God pic.twitter.com/yr9TgX5IXM
— Ashish Verma (@ashu112) September 29, 2022