రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 టోర్నీలో ఇండియా లెజెండ్స్ ఫైనల్ దూసుకెళ్లింది. గురువారం ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో నమాన్ ఓజా(90 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇర్ఫాన్ పఠాన్(12 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 37 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ విజయాన్నందించాడు.
సీజన్ 2లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సచిన్ సేన అందుకు తగ్గ ఆట తీరునే ప్రదర్శిస్తోంది. ఆరంభ మ్యాచులో సౌతాఫ్రికా లెజెండ్స్ పై సునాయాస విజయాన్ని అందుకున్న భారత్ లెజెండ్స్, ఆపై గ్రూప్ స్టేజ్ లో ఇంగ్లాండ్ లెజెండ్స్ పై కూడా గెలుపొందింది. మిగిలిన మూడు మ్యాచులు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఈ తరుణంలో సెమీఫైనల్ కు అర్హత సాధించిన ఇండియా లెజెండ్స్ ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో తలపడింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన సెమీ ఫైనల్ 1లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా లెజెండ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్ ఓ దశలో 125 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
Take a bow – Irfan Pathan 🙏@IrfanPathan #irfanpathan #RoadSafetyWorldSeries2022 pic.twitter.com/jsBa0KqWR2
— Oh My Cricket (@OhMyCric) September 29, 2022
ఇక విజయం సాధించడం కష్టమని అంతా అనుకున్నారు. కానీ ఇర్ఫాన్ పఠాన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. చివరి 24 బంతుల్లో భారత్ లెజెండ్స్ విజయానికి 49 పరుగులు అవసరమవ్వగా.. ఇర్ఫాన్ పఠాన్ ఒక్కడే 36 పరుగులు చేశాడు. డిర్క్ నన్నేస్ వేసిన 19వ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. ఫలితంగా మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఇండియా లెజెండ్స్ విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో నమాన్ ఓజా (62 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 90*) పరుగులతో రాణించాడు. ఇక రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక లెజెండ్స్ జట్టు, వెస్టిండీస్ లెజెండ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు అక్టోబర్ 1న శనివారం జరిగే ఫైనల్‌లో ఇండియా లెజెండ్స్‌తో టైటిల్ పోరులో నిలుస్తుంది. రోడ్డు ప్రమాదాలపై విశ్వవ్యాప్తంగా అవగాహన కల్పించడం కోసం ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు.
Naman Ojha’s unbeaten 90 and Irfan Pathan’s heroic finish guide India Legends to the final of Road Safety World Series 2022.#CricTracker #IrfanPathan #NamanOjha #RSWS pic.twitter.com/OtHpKVjuvd
— CricTracker (@Cricketracker) September 29, 2022