అమిత్ మిశ్రా, వసీం జాఫర్.. సోషల్ మీడియాలో ఎక్కువుగా వినిపించే భారత క్రికెటర్లు వీరిద్దరే. నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటారు. మ్యాచ్ అయినా.. మ్యాచుకు సంబంధం లేని ఘటన అయినా.. వీరి నుంచి తప్పక రెస్పాన్స్ ఉంటుంది. ఈ సమయాన్ని వృధా చేసుకోకూడదనుకున్న ఓ నెటిజెన్ అమిత్ మిశ్రాను సాయమడిగాడు. అదీ ఎలాగంటే.. ‘నా గర్ల్‌ఫ్రెండ్‌ని డేట్‌కి తీసుకెళ్లాలి, ఓ 300 రూపాయలు ఇవ్వవా?’ అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఈ కామెంట్ చూశాక మిశ్రా మనసు కరిగిపోయి వెంటనే అమౌంట్ ట్రాన్సఫర్ చేసాడు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా మిశ్రా సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ప్రస్తుతం అమిత్ మిశ్రా వయసు 39 ఏళ్లు. క్రికెట్ కు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. అలాగని క్రికెట్ కు దూరంగా ఉండట్లేదు. సోషల్ మీడియాలో భారత జట్టుకు వ్యతిరేకంగా ఎలాంటి న్యూస్ వచ్చినా తనదైన అమిత్ మిశ్రా తన చమత్కారంగా కౌంటర్ ఇస్తుంటాడు. మంచి సందర్భమైతే పొగుడుతూ కామెంట్లు విసురుతుంటాడు. ఈ క్రమంలో తాజాగా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 టోర్నీలో సురేష్ రైనా పట్టిన కళ్లు చెదిరే క్యాచ్ వీడియోపై ట్విట్టర్‌లో స్పందించాడు. “రైనా భాయ్ .. నీ టైమ్ మెషిన్‌ని అప్పు తీసుకోవచ్చా? మీ మునుపటి ఫీల్డింగ్ మరోసారి చూడడం చాలా బాగుంది..” అంటూ కామెంట్ చేశాడు.
Sir 300 rs gpay karodo gf ko ghumne leke Jana h
— MSDIAN adi (@AdityaK61351639) September 29, 2022
ఈ కామెంట్ కింద ఓ నెటిజన్, “మిశ్రా జీ.. నా గర్ల్‌ఫ్రెండ్‌ని డేట్‌కి తీసుకెళ్లాలి, ఓ 300 రూపాయలు ఇవ్వవా?” అంటూ రిక్వెస్ట్ చేశాడు. దానికి మిశ్రా ఏకంగా రూ.500 పంపి, ఆ స్క్రీన్ షాట్‌ని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. “నువ్ అడిగింది పంపించా.. నీ డేట్‌కి ఆల్ ది బెస్ట్..” అంటూ కామెంట్ చేశాడు. దీనికి ఆ నెటిజన్, మిశ్రాకి ధన్యవాదాలు తెలుపుతూ మరో ట్వీట్ చేశాడు. అడగ్గానే డబ్బులు పంపిన అమిత్ మిశ్రా మంచి మనసుపై నెటిజన్స్ ప్రశంశలు కురిపిస్తున్నారు. 300 కదా! అని తేలిగ్గా తీసుకోకుండా సాయం చేయడాన్ని మెచ్చుకుంటున్నారు.
Done, all the best for your date. 😅 https://t.co/KuH7afgnF8 pic.twitter.com/nkwZM4FM2u
— Amit Mishra (@MishiAmit) September 29, 2022
కాగా, 2003లో సౌతాఫ్రికాపై అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన అమిత్ మిశ్రా, టీమిండియా తరుపున 22 టెస్టులు, 36 వన్డేలు, 8 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 76 వికెట్లు తీసిన అమిత్ మిశ్రా, వన్డేల్లో 64, టీ20ల్లో 14 వికెట్లు తీశాడు. ఇక, ఐపీఎల్ చరిత్రలో మూడు హ్యాట్రిక్‌లు సాధించిన ఏకైక ఆటగాడు అమిత్ మిశ్రా. 2008, 2011లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున, 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున హ్యాట్రిక్ సాధించాడు. ప్రస్తుతానికి క్రికెట్‌కి దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. అన్ని రకాల క్రికెట్‌ని ఫాలో అవుతున్నాడు.