మరో నాలుగు రోజుల్లో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ శకం ముగియనుంది. అతని స్థానంలో బీసీసీఐ పీఠంపై 1983 విన్నింగ్ టీంలో సభ్యుడైన రోజర్ బిన్నీ కూర్చోనున్నాడు. ఇది దాదాపు ఖాయం. దాదా మరోసారి కొనసాగాలని భావించినా బోర్డు సభ్యులు అందుకు అంగీకారం తెలపలేదు. దీంతో ఎలక్షన్స్ నిర్వహించాల్సివస్తోంది. అయితే.. గంగూలీని తప్పించడం వెనుక సీఎస్కే యజమాని శ్రీనివాసన్, టీమిండియా మాజీ సారధి ధోనీ ప్రమేయం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అందుకు బలమైన కారణాన్నే దాదా అభిమానులు సాకుగా చూపుతున్నారు.
బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పనితీరు బాగోలేదని బోర్డు సభ్యులు విమర్శలు చేస్తున్నప్పటికీ అందులో వాస్తవం లేదు. ప్రపంచమంతా కరోనా కల్లోలం రేగుతున్న సమయంలో ఐపీఎల్ 2022 సీజన్‌ని విజయవంతంగా నిర్వహించి, ‘శభాష్’ అనిపించుకున్నాడు దాదా. అంతేకాదు.. ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు కొత్త ప్రాంచైజీలను ఆహ్వానించి బోర్డుకు కాసుల వర్షం కురిపించాడు. ఆపై.. 2023-27 వరకు ఐపీఎల్ మీడియా హక్కుల విక్రయానికి వేలం పాట నిర్వహించి.. దాని ద్వారా రూ.43 వేల కోట్లు ఆర్జించాడు. ఇలా ఎంత చేసినా బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీని మరోసారి కొనసాగించడానికి బోర్డు సభ్యులు ఇష్టపడలేదు. భారత క్రికెట్‌లో ‘దాదా గిరి’’ ఎక్కువయ్యిందంటూ.. అతన్ని బలవంతంగా ఆ పదవి నుంచి దింపేస్తున్నారు. అయితే.. ఈ తొలగింపు వెనుక చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్ శ్రీనివాసన్ హస్తమున్నట్లు వార్తొలొస్తున్నాయి.
Former Indian skipper and BCCI president Sourav Ganguly’s first reaction after the news of his departure from the top post came out.#CricTracker #SouravGanguly #BCCI #IndianCricket pic.twitter.com/nZdLspOae3
— CricTracker (@Cricketracker) October 13, 2022
‘ధోనీ ఏం చెప్తే.. అది చేస్తాడన్నట్లుగా శ్రీనివాసన్ కు పేరుంది. దీంతో ధోనీయే శ్రీనివాసన్ చేత ఇలా చేపించాడని వార్తలు వినపడుతున్నాయి. గంగూలీపై ధోనీకి కక్ష లేనప్పటికీ.. కోహ్లీతో ఉన్న సాన్నిహిత్యమే అందుకు కారణమంటున్నారు.. నెటిజన్స్. గంగూలీకి, విరాట్ కోహ్లీకి ఉన్న విభేదాల గురుంచి అందరకి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ. ఈ నిర్ణయానికి గంగూలీయే కారణమని బలంగా వార్తలు వినిపించాయి. తనకు ఈ నిర్ణయం గంట ముందు చెప్పారని కోహ్లీ, లేదు తనను తప్పుకోవద్దని ముందే వారించామని గంగూలీ మీడియా ముందు వెల్లడించారు. అప్పట్లో ఈ విషయం గురించి ప్రపంచ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. దీన్ని మనసులో పెట్టుకున్న కోహ్లీ.. ధోనీని అస్త్రంగా వాడి గంగూలీని తప్పించినట్లు నెటిజన్లు కథలు అల్లుతున్నారు. ఇందులో నిజమెంతో తెలియనప్పటికీ.. కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్లు హ్యాపీగా ఉన్నారు.
Sourav Ganguly was offered the post of IPL Chairman, but he wanted to continue as BCCI President so he’s basically sacked ! 😭😭🔥
KARMA never loses an address !🛐🤲 pic.twitter.com/zcu25gnPIz
— 𝐒𝐚𝐮𝐫𝐚𝐛𝐡 𝐓𝐫𝐢𝐩𝐚𝐭𝐡𝐢 (@SaurabhTripathS) October 11, 2022