విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇద్దరూ భారత జట్టుకి రెండు పిల్లర్లు లాంటి వారు. ఏ ఒకరు లేకుండా జట్టును ఊహించుకోవడమే కష్టం. కాకుంటే.. వీరిద్దరి మధ్య సత్సంబంధాలు లేవనే పుకార్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఒకరంటే ఒకరికి పడదని, అందుకే మైదానంలో క్లోజ్‌గా ఉండరనే వాదన ఉంది. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా వీరి అభిమానులు నిత్యం గొడపపడుతూనే ఉంటారు. ‘మా కోహ్లీ..’ బెస్ట్ అంటే.. ‘మా హిట్ మ్యాన్..’ బెస్ట్ అంటూ పోస్టులు పెడుతుంటారు. తాజాగా, ఈ విషయంపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ఆర్సీబీ-ముంబై మాజీ ఐపీఎల్ ఆటగాడు కోరీ ఆండర్సన్ స్పందించాడు. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అన్నది తేల్చకపోయిన అందరకి ఓ క్లారిటీ ఇచ్చాడు.
‘విరాట్ కోహ్లీ – రోహిత్ శర్మ..’ మైదానంలో వీరిద్దరి ఆలోచనలు ఎలా ఉంటాయి. తోటి ఆటగాళ్లతో ఎలా నడుచుకుంటారు. ఏవైనా కఠిన నిర్ణయాలు తీకోవాల్సిన సమయంలో ఎలా వ్యవహరిస్తారు. ఇలాంటి ప్రశ్నలు ఎప్పటికీ అంతుచిక్కనివే. ఎందుకంటే.. సాధారణ ప్రేక్షుకుడిగా వారిని మనం దగ్గదనుంచి గమనించే అవకాశాలు రావు. వాటిని బయటపెట్టాలంటే.. వారితో కలిసి క్రికెట్ ఆడిన ఆటగాళ్లకే సాధ్యం. అలా వారిద్దరితో కలిసి ప్రాంచైజీ క్రికెట్ (ఐపీఎల్) ఆడిన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ కోరీ ఆండర్సన్ ఆ విషయాలను బహిర్గతం చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీ విధానం చాలా భిన్నంగా ఉంటుందని చెప్పిన ఆండర్సన్.. “కోహ్లీ ఎక్కువ సమయం ఫీల్డ్‌లో గడపడానికి ఇష్టపడితే.. రోహిత్ కు మీటింగ్ లంటే ఎక్కువ ఇష్టమని” తెలిపాడు.
“Virat Kohli and Rohit Sharma both are very good captains, both are brilliant.” – Corey Anderson (To News18)
— CricketMAN2 (@ImTanujSingh) October 12, 2022
“కోహ్లీ, రోహిత్.. కెప్టెన్సీ విధానం చాలా భిన్నంగా ఉంటుంది. కోహ్లీ ఎక్కువ సమయం ఫీల్డ్‌లో గడుపుతాడు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తాడు. ప్లేయర్ల బలబలాలపై అతని పూర్తి నమ్మకం ఉంటుంది. గ్రౌండ్‌లోనే ఏది వర్కవుట్ అవుతుంది, ఏది కాదని డిసైడ్ చేస్తాడు. కానీ, రోహిత్ రోహిత్ అలా కాదు.. ఎక్కువ సమయం మీటింగ్స్‌కు వెచ్చిస్తాడు. అలా అని నెగ్లెక్ట్ చేయలేము. గేమ్‌ని అద్భుతంగా అర్థం చేసుకుంటాడు. గ్రౌండ్ లో యాక్టీవ్‌గా లేకున్నా, అతని బుర్రలో ఆలోచనలు కదులుతూనే ఉంటాయి. మ్యాచ్ చేజారే క్షణాల్లో కూడా అవకాశాలను క్రియేట్ చేయగలడు”.
“Rohit Sharma reads the game very very well. He’s very proactive captain. We’ve seen with the Mumbai Indians team how he’s led that team over many many years. He’s very captain.” – Corey Anderson (To News18)
— CricketMAN2 (@ImTanujSingh) October 12, 2022
“అలాగే.. కోహ్లీకి బౌలర్లపై నమ్మకం ఎక్కువ. వాళ్లు బాగా వేయకపోయినా వారిని పూర్తిగా నమ్ముతాడు. కాకుంటే.. అతనిలో స్థిమితం తక్కువ. కొన్నిసార్లు ఓ ప్లాన్ వర్కవుట్ కాకపోతే వేరే దానికి వెళ్లిపోతూ ఉంటాడు. అయితే.. రోహిత్ మాత్రం అలా చేయడు. అతను అనుకున్న ప్లాన్ వర్కవుట్ కాకపోయినా అది వర్కవుట్ అయ్యేదాకా దాన్ని వదిలిపెట్టడు. అతనికి మొండి పట్టుదల ఎక్కువ. ముంబై ఇండియన్స్ సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే అని నా నమ్మకం..” అని చెప్పుకొచ్చాడు కోరీ అండర్సన్. కాగా, కోరీ అండర్సన్, ఐపీఎల్‌లో 2014 నుంచి 2016 వరకు ముంబై ఇండియన్స్ కు, 2018లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
‘Kohli reacts to on-field situations, Rohit is more proactive, prepares in meetings’: Kiwi allrounder Corey Anderson on Virat Kohli and Rohit Sharma’s captaincy https://t.co/CEsCSxX5gF
— Babsa News (@BabsaNews) October 13, 2022