ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇంగ్లాండ్ ని 110 పరుగులకే ఆలౌట్ చేసింది టీమిండియా. అనంతరం స్వల్ప లక్ష్యంతో భారత్ బ్యాటింగ్ కి దిగింది. లక్ష్యాన్ని టీమిండియా సాఫీగా ఛేదించింది. అయితే భారత్ ఇన్నింగ్స్ సమయంలో ఓ ఘటన చోటు చేసుకుంది. రోహిత్ శర్మ కొట్టిన ఓ భారీ సిక్సర్.. స్టేడియంలో మ్యా చ్ చూసేందుకు వచ్చిన చిన్నారికి బలంగా తాకింది. దీంతో ఆ చిన్నారి నొప్పికి తట్టుకోలేక విలవిల్లాడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో బుమ్రా (6/19) సంచలన బౌలింగ్, ఓపెనర్ రోహిత్ శర్మ (76 నాటౌట్; 58 బంతుల్లో) ధనాధన్ ఇన్నింగ్స్.. మరో ఓపెనర్ ధావన్ (31నాటౌట్; 54 బంతుల్లో) కూడా నిలకడగా ఆడడంతో భారత్ 18.4 ఓవర్లలో ఒక్క వికెట్టూ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఈ క్రమంలోనే ఐదో ఓవర్ డేవిడ్ విల్లీ వేసిన మూడో బంతిని ఫుల్ షాట్ ఆడిన రోహిత్.. బలమైన షాట్ కొట్టాడు. దీంతో అది కాస్త స్టేడియంలో తండ్రి చేతుల్లో ఉన్న ఓ చిన్నారిని తాకింది. దీంతో ఆ పాప గట్టిగా ఏటవడం మొదలు పెట్టింది. బంతి బలంగా తాకడంతో నొప్పిని తట్టుకోలేక ఆ పాప అల్లాడిపోయింది. ఈ విషయాన్ని బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బెన్‌స్టోక్స్.. రోహిత్‌కు చెప్పాడు. ఇది తెలుసుకున్న హిట్‌మ్యాన్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో కొద్దిసేపు మ్యాచ్‌ను ఆపారు.
అయితే వెంటనే ఇంగ్లాండ్ ఫిజియోలు ఆ పాప దగ్గరికి వెళ్లి ప్రాథమికి చికిత్స చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం ఎలా ఉందనేది సమాచారం తెలియలేదు. అయితే ట్విట్టర్లో మాత్రం ఓ నెటిజన్.. ఆ పాప పేరు మీరా సాల్వి అని, ఆమె ప్రస్తుతం బాగానే ఉందని ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Guess Karo (@KuchNahiUkhada) July 12, 2022
— Guess Karo (@KuchNahiUkhada) July 12, 2022