బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు రోహిత్ సేన సిద్ధమైంది. రేపు(ఆదివారం) ఢాకా వేదికగా తొలి వన్డేలో తలపడనుంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. అలాగే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడిన రిషభ్ పంత్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్ నుంచి నేరుగా బంగ్లాదేశ్ చేరుకుని జట్టుతో కలిశారు. కివీస్ పర్యటనలో లేని ఆటగాళ్లు భారత్ నుంచి శుక్రవారమే బంగ్లాదేశ్ చేరుకుని.. శనివారం ప్రాక్టీస్ సైతం మొదలుపెట్టారు. భీకర ఫామ్‌లో ఉన్న విరాట్‌కోహ్లీ వన్డే సిరీస్‌లోనూ అదరగొట్టడానికి రెడీగా ఉన్నాడు. అలాగే ఫామ్‌లో లేని రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సైతం ఈ టూర్‌తో ఫామ్‌లో రావాలని పట్టుదలతో ఉన్నారు. పైగా రోహిత్‌కు బంగ్లాపై మంచి రికార్డు ఉంది. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల పాటు రెండు టెస్టులు సైతం ఆడనుంది టీమిండియా. కాగా.. వన్డే సిరీస్‌కు సంబంధించిన ట్రోఫీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌తో చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నామని, బంగ్లాపై విజయం సాధించడం అంత సులువైన విషయం కాదని అన్నాడు. కొన్నేళ్లుగా బంగ్లాదేశ్ టీమ్ చాలా మెరుగైందని, అందుకే ఆ టీమ్‌ను ఏ మాత్రం తక్కువ అంచనా వేయకుండా ఆడతామని రోహిత్ తెలిపాడు. కాగా.. ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో సూపర్ 12 స్టేజ్‌లో బంగ్లాదేశ్-టీమిండియా జట్లు తలపడగా.. టీమిండియా ఘన విజయం సాధించింది. అయినా కూడా బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు.
ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ 2022లో సెమీస్‌లో దారుణ ఓటమితో టీమిండియా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని టీమిండియా న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్నా.. వర్షం వల్ల దక్కిన విజయంగా క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత వన్డే సిరీస్‌ను శిఖర్ ధావన్ కెప్టెన్సీలో 1-0 తేడాతో ఓడిపోయింది భారత్. ఇప్పుడు బంగ్లాదేశ్‌ను పసికూనగా లైట్ తీసుకుని ఆడి.. సిరీస్ అటుఇటూ అయినా కూడా టీమిండియా మరింత ప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గట్లు ఆడితే.. బంగ్లాదేశ్‌ను ఓడించడం పెద్ద విషయం కాకపోయినా.. జట్టు ఎక్కువగా ఒకరిద్దరిపై ఆధారపడుతుండటం కొంచెం ఆందోళన పరుస్తున్న విషయం.
Rohit Sharma & Liton Das with the ODI series trophy. pic.twitter.com/uqYduoKSp7
— Johns. (@CricCrazyJohns) December 3, 2022