కెప్టెన్ అయిన తర్వాత టీ20ల్లో రోహిత్ శర్మకు వరస విజయాలు దక్కాయి. దీంతో భారత జట్టు విజయాల పరంపర కొనసాగించడం పక్కా అని అందరూ అనుకున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో.. అందులోనూ మన జట్టు విజేతగా నిలుస్తుందనే ఆశలు చిగురించాయి. కట్ చేస్తే… ఈ మధ్య కాలంలో వరస మ్యాచుల్లో ఓడిపోవడం టీమిండియాని కలవరపెడుతోంది. కప్పు కాదు కదా కనీసం టోర్నీలో లీగ్ దశ అయినా దాటుతుందా అనే సందేహాలు రేకెత్తిస్తోంది. ఇక ఆస్ట్రేలియాతో తొలి టీ20లో ఓడిపోవడంపై రోహిత్ శర్మ.. అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మొహాలీ వేదికగా తొలి టీ20. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమిండియా.. 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 55, సూర్య కుమార్ యాదవ్ 46, హార్దిక్ పాండ్య 71 పరుగులు చేసి అదరగొట్టారు. భారీ స్కోరుతో విజయంపై ఆశలు రేపారు. ఇక బౌలింగ్, ఫీల్టింగ్ కరెక్ట్ చేస్తే చాలు విజయం మనదే అని ఫ్యాన్స్ కూడా ఫిక్సయ్యారు. కానీ అక్కడ జరిగింది వేరు. ఆస్ట్రేలియా గెలిచింది అనేకంటే మన బౌలర్ల వైఫల్యం వల్లే విజయం సాధించింది అని చెప్పాలి. అంత దారుణమైన ప్రదర్శన చేశాడు. దానికి తోడు ఆస్ట్రేలియా విజయానికి కారణమైన గ్రీన్, స్మిత్ ఇచ్చిన సులభమైన క్యాచులని కూడా మన ఫీల్డర్స్ వదిలేశారు. దీంతో వారిపై రోహిత్ శర్మ సీరియస్ అయినట్లు తెలుస్తోంది
దీంతో ఈ మ్యాచ్ లో భారత బౌలింగ్ చేస్తున్నంతసేపు కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ డిసప్పాయింట్ మెంట్ తో కనిపించాడు. మ్యాచ్ పూర్తయిన తర్వాత ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘మేం చెత్తగా బౌలింగ్ చేశాం. మైదానంలో వచ్చిన ఛాన్సులు సద్వినియోగం చేసుకోలేకపోయం. మా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. బౌలర్లే సత్తా చాటలేకపోయారు. ఈ మ్యాచ్ మాకు గుణపాఠం లాంటింది. ఈ పిచ్ పై 200 రన్స్ చేసినా ప్రశాంతంగా ఉండలేమని తెలుసు. మేం వికెట్లు తీసినప్పటికీ, ప్రత్యర్థి జట్టు బాగా ఆడింది. ఐదు వికెట్లు తీసిన మేం.. ఆరో వికెట్ తీయడంలో మాత్రం విఫలమయ్యాం. ఈ వికెట్ కాస్త త్వరగా తీసుకుంటే.. మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది’ అని రోహిత్ శర్మ చెప్పాడు. ఇదిలా ఉండగా 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. భారత్ బౌలర్ల వైఫల్యం వల్ల 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. మరి రోహిత్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Things went right down to the wire but it’s Australia who won the first #INDvAUS T20I.#TeamIndia will look to bounce back in the second T20I.
Scorecard 👉 https://t.co/ZYG17eC71l pic.twitter.com/PvxtKxhpav
— BCCI (@BCCI) September 20, 2022
ఇదీ చదవండి: ఆస్ట్రేలియాపై ఓటమి.. అయినా సరికొత్త రికార్డు సృష్టించిన భారత్!