ఈ మధ్య జరిగిన ఆసియాకప్.. టీమిండియా అభిమానుల కళ్ల ముందు ఇంకా మెదలాడుతూనే ఉంది. సరేలే అయిపోయిందేదో అయిపోయింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో అయినా తమ అభిమాన జట్టు ఫేట్ మారుతుందనుకుంటే.. తొలి మ్యాచులోనే నిరాశ ఎదురైంది. ఓటముల్ని కొనసాగించిన భారత జట్టు.. మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో సులభంగా గెలవాల్సిన మ్యాచ్, చేజేతులా ఓడిపోయేలా చేసుకుంది. మ్యాచ్ పోయిందనే బాధ ఉన్నప్పటికీ ఓ రికార్డు మాత్రం సృష్టించడంతో కాస్తలో కాస్త అయినా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Things went right down to the wire but it’s Australia who won the first #INDvAUS T20I.#TeamIndia will look to bounce back in the second T20I.
Scorecard 👉 https://t.co/ZYG17eC71l pic.twitter.com/PvxtKxhpav
— BCCI (@BCCI) September 20, 2022
ఇక వివరాల్లోకి వెళ్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమిండియాకు అశినంత శుభారంభం దక్కలేదు. తొలి ఐదు ఓవర్ల లోపే రోహిత్ శర్మ 11 పరుగులు, కోహ్లీ 2 పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో భారత్ కి ఈ మ్యాచులోనూ బ్యాటింగ్ కష్టాలు తప్పవేమో అనుకున్నారు. కానీ గత కొంతకాలంగా బ్యాటింగ్ లో పూర్తి నిరాశపరుస్తున్న కేఎల్ రాహుల్.. 55 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. తన ఫామ్, స్ట్రైక్ రేట్ పై మ్యాచ్ కి ముందురోజు విమర్శకులకు సమాధానమిచ్చిన రాహుల్.. మ్యాచ్ లో బ్యాటింగ్ తో అదరగొట్టాడు
మరోవైపు వచ్చీరావడంతోనే ధనాధన్ షాట్లతో అలరించిన సూర్యకుమార్ యాదవ్ కూడా 25 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ఇక 12 ఓవర్ చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్య అయితే చితక్కొట్టుడు అనే పదాన్ని గ్రౌండ్ లో చూపించాడు. చివరి 8 ఓవర్లలో క్రీజులో ఉన్న హార్దిక్.. 30 బంతుల్లో 71 పరుగులు చేసి.. జట్టు 208 స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాపై సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. టీ20ల్లో ఆసీస్ జట్టుపై భారత్ కి ఇదే అత్యధిక స్కోరు. ఇదిలా ఉండగా టీమిండియా బ్యాటింగ్ పరంగా ఆకట్టుకుంటున్న ఫీల్డింగ్, బౌలింగ్ విషయాల్లో మాత్రం తేలిపోతోంది. మరి ఓడినా సరే ఆసీస్ పై రికార్డు నమోదు చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
𝗬𝗼𝘂 𝗝𝘂𝘀𝘁 𝗖𝗮𝗻 𝗡𝗼𝘁 𝗠𝗶𝘀𝘀 𝗧𝗵𝗶𝘀! @hardikpandya7 creamed 7⃣ Fours & 5⃣ Sixes to hammer 7⃣1⃣* off 3⃣0⃣ balls! ⚡️ 🎇 #TeamIndia | #INDvAUS
Watch that stunning knock 🔽https://t.co/C1suCKBPK7 pic.twitter.com/3o86bZEIzn
— BCCI (@BCCI) September 20, 2022
ఇదీ చదవండి: ఆస్ట్రేలియాపై హార్దిక్ పాండ్యా విధ్వంసం! చివర్లో హ్యాట్రిక్ సిక్స్ లు!