ఐపీఎల్ 2022 సీజన్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ప్రతి మ్యాచ్, ప్రతి బౌండరీ, ప్రతి వికెట్ ఎంతో ఉత్సుకతను రేకెత్తిస్తున్నాయి. అయితే రెండు జట్లకు మాత్రం ఈ సీజన్ మొత్తం ఒక పెద్ద పీడకలగా సాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ కనీసం 7 మ్యాచ్ లలో రెండన్నా గెలిచింది. కానీ, ముంబయి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఆడిన 8 మ్యాచ్ లలో ఒకటంటే ఒక్క విజయం కూడా లేకుండా.. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పరిమితమైంది. ముంబై ఇండియన్స్ పరిస్థితిపై ట్రోల్స్ కూడా వస్తూనే ఉన్నాయి. అయితే ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా తమ పరాజయాలపై స్పందించాడు. ఇది ఎంతో గడ్డుకాలం అంటూ రోహిత్ కామెంట్ చేశాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్ నుంచి తమతో పాటు CSKనూ తీసుకెళ్లిన ముంబై
2008లో ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి 14వ సీజన్ వరకు ఎన్నో రికార్డులు, మరెన్నో రివార్డులు ముంబై ఇండియన్స్ సొంతం. ఆ జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఐపీఎల్ లో రోహిత్ శర్మ ఎంతో సక్సెస్‌ఫుల్ కెప్టెన్ కాబట్టే టీమిండియా టీ20 జట్టు పగ్గాలు కూడా అతనికే అందించారు. పరాజయాన్ని అంత తేలిగ్గా అంగీకరించడు.. ఎంత క్లిష్టమైన పరిస్థితి నుంచైనా జట్టును విజయ తీరాలకు చేర్చడం రోహిత్ శర్మలో ఉన్న స్పెషల్ క్వాలిటీ. కానీ, ఇదంతా ఐపీఎల్ 2021 వరకు మాత్రమే. ఇప్పుడు ఆ లెక్కలు తప్పాయి. మొత్తం కథంతా అడ్డం తిరిగింది.
ఐపీఎల్ లో అత్యధిక టైటిల్స్ సొంతం చేసుకున్న ముంబై జట్టు, దాని అభిమానులు.. ఐపీఎల్ 2022 సీజన్లో ఒక్క విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఆ జట్టు పరిస్థితి చూసి క్రికెట్ ప్రేక్షకులు సైతం అయ్యో అంటున్నారు. ఎన్నో అద్భుత విజయాలు నమోదు చేసిన జట్టు.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితం కావడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో ఎనిమిదింట ఓటమిపాలై 0 పాయింట్లు, -1 నెట్ రన్ రేట్ తో టేబుల్ లీస్ట్ పొజిషన్ లో కొనసాగుతోంది. అయితే జట్టుపై వస్తున్న కామెంట్స్, వారి ఆటతీరుపై స్వయంగా రోహిత్ శర్మ స్పందించాడు.
ఇదీ చదవండి: రూ.15.25 కోట్లతో కొంటే.. ఇషాన్ 20 బంతులాడి ఒక్క ఫోర్ కూడా కొట్టలేదు!
‘ఈ సీజన్‌లో మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాం.. ఇంక ఈ టోర్నమెంట్లో ముందుకెళ్లే పరిస్థితి కూడా లేదు. ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నవాళ్లే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను ఈ జట్టును, ఇక్కడి వాతావరణాన్ని ప్రేమిస్తాను. ఇలాంటి పరిస్థితుల్లోనూ మాపై అపారమైన ప్రేమానురాగాలు, గౌరవాన్ని చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ రోహిత్ శర్మ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ఈ సీజన్ కు ముంబై జట్టు పరిస్థితి ఇలా ఉండచ్చేమే.. వచ్చే సీజన్లో మాత్రం ముంబై మళ్లీ పుంజుకుంటుంది అంటూ అభిమానులు, సపోర్టర్స్ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు గత సీజన్లో టేబుల్ లీస్ట్ లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఇప్పుడు టేబుల్ సెకెండ్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇలాంటి లీగుల్లో ఏదీ శాశ్వతం కాదు.. ముంబై జట్టు కూడా కంబ్యాక్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముంబై జట్టు పరిస్థితి, రోహిత్ శర్మ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
We haven’t put our best foot forward in this tournament but that happens,many sporting giants have gone through this phase but I love this team and it’s environment. Also want to appreciate our well wishers who’ve shown faith and undying loyalty to this team so far 💙@mipaltan
— Rohit Sharma (@ImRo45) April 25, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.