జట్టులో 10 మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నా.. వారిని నడిపించేందుకు సరైన నాయకుడు లేకుంటే ఆ జట్టు ఛాంపియన్ కావడం కష్టం. అలాగే.. టీమ్‌లోని ఆటగాళంతా మ్యాచ్ విన్నర్లు కాకపోయినా.. సరైన కెప్టెన్ ఉంటే.. అదే టీమ్‌తో అద్భుతాలు చేయగలడు. ఇలా.. ఏ ఆటలోనైనా, ఏ పోటీలోనైనా.. కెప్టెన్ అనే వాడు ఎంతో ముఖ్యం. పైగా క్రికెట్లో అయితే కెప్టెన్ రోల్ కత్తిమీద సాములాంటింది. అలాంటి రోల్‌ను సమర్థవంతంగా పోషించన వారు కొందరే ఉన్నారు. అలాంటి వారిలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఒకరైతే, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరొకరు. ఇద్దరూ గొప్ప కెప్టెన్లే అయినా.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అంటే ఠక్కున చెప్పేయడం అసాధ్యం. ఎందుకంటే.. వారి జర్నీ గురించి కాస్త విశ్లేస్తే గానీ.. ఒకరి కాసింత ఎక్కువ వెయిటేజీ ఇవ్వలేం. ఇప్పుడా ప్రయత్నం మనం చేద్దాం.
ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ స్టీవా తర్వాత ఆసీస్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన పాంటింగ్.. ఆసీస్ జైత్రయాత్రను అదే స్థాయిలో కొనసాగించాడు. 2003, 2007 వన్డే వరల్డ్ కప్‌ను అందించి.. ఆస్ట్రేలియాను క్రికెట్ ప్రపంచంలో ఒక తిరుగులేని శక్తిగా నిలబెట్టాడు. పాంటింగ్ కెప్టెన్‌గా ఉన్న ఆసీస్‌తో తలపడేందుకు ప్రపంచంలోని మిగతా జట్లు వణికిపోయేవి. ఆటగాడిగా అద్భుతంగా ఆడుతూనే.. కెప్టెన్‌గా ఆస్ట్రేలియా నంబర్‌వన్‌గా రెండు వరల్డ్ కప్స్‌లో నడిపించిన ఘనత పాంటింగ్‌కు దక్కింది. ఆస్ట్రేలియా చరిత్రలో రెండు వరల్డ్ కప్‌లు గెలిచిన ఏకైక కెప్టెన్ పాంటింగ్. ఇలాంటి అద్భుతమైన రికార్డులు ఉన్న పాంటింగ్ ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్‌గా కీర్తించబడ్డాడు. అయితే.. పాంటింగ్ గొప్ప కెప్టెన్‌గా మారేందుకు అతనికి బెస్ట్ టీమ్ ఉండటం ఒక కారణం. స్టీవా కెప్టెన్సీలోనే ఆస్ట్రేలియా ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది. మ్యాథ్యూ హేడెన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఆండ్రూ సైమండ్స్, షేన్ వార్న్, మెక్‌గ్రాత్, గిల్లెస్పీ, బ్రెట్‌లీ లాంటి మ్యాచ్ విన్నర్లతో కూడిన ఆస్ట్రేలియాను సమర్థవంతంగా నడిపించి పాంటింగ్ గొప్ప కెప్టెన్‌గా పేరుతెచ్చుకున్నాడు.
అదే సమయంలో సౌరవ్ గంగూలీ.. టీమిండియా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో సతమతమవుతున్న సమయంలో భారత కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. గంగూలీ రాక ముందు టీమిండియా.. పసికూన జింబాబ్వే చేతుల్లోనూ ఓడిపోయే పరిస్థితి. టీమిండియాలో సచిన్ తప్ప.. ఇంకో స్టార్ లేడు. సచిన్‌ను అవుట్ చేస్తే చాలు.. టీమిండియాను ఆలౌట్ చేసినట్లేనని ప్రపంచ దేశాలు భావిస్తున్న తరుణంలో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గంగూలీ.. అంచెలంచెలుగా టీమిండియాను నిర్మించుకుంటూ వచ్చాడు. సచిన్, ద్రవిడ్ లాంటి సీనియర్లను అంటిపెట్టుకుంటూనే.. వీరేందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్, మొహమ్మద్ కైఫ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, అజిత్ అగార్కర్, ఇర్ఫాన్ పఠాన్, ఎంఎస్ ధోని లాంటి యువ క్రికెటర్లను ప్రోత్సహించి.. ఒక యంగ్ టీమిండియాను నిర్మించాడు.
స్వదేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం టీమిండియాకు గెలవడం నేర్పించాడు. ప్రత్యర్థి ఎంత తోపైనా.. ఓడించగలమనే నమ్మకాన్ని జట్టులో నింపాడు. ప్రతిదానికి భయపడుతూ.. ఆటతో కాకుండా భయంతోనే సగం చచ్చిపోయే జట్టును.. గర్జించే సింహంలా మార్చాడు. ప్రపంచ క్రికెట్లో టీమిండియా అంటే ఒక సాధారణ జట్టు అనే భావనను కూకటి వేళ్లతో సైతం పెకలించి.. ఒక అసాధారణ, అసామన్య జట్టుగా మార్చాడు. గంగూలీ నిర్మించిన జట్టుతోనే ధోని.. 2011లో ప్రపంచ కప్‌ను గెలిచిచాడు. ఓపెనర్‌గా చెలరేగిన సెహ్వాగ్‌ను ఓపెనర్ చేసింది దాదానే, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన యువరాజ్ సింగ్‌ను షైన్ చేసింది దాదానే, బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించిన జహీర్, హర్భజన్లను టీమ్‌లోకి తెచ్చింది గంగూలీనే.
ఇలా దాదా తయారు చేసిన జట్టుతోనే ధోని వరల్డ్‌కప్ నెగ్గాడనే వాస్తవం. అందుకే కెప్టెన్‌గా గంగూలీ కెప్టెన్ వరల్డ్ కప్ నెగ్గక పోయినా.. భారత క్రికెట్లో అతనే అత్యుత్తమ కెప్టెన్. ఇక పాంటింగ్‌తో పోల్చినా.. దాదానే బెస్ట్ కెప్టెన్. అన్ని టీమ్‌ను అదే స్థాయిలో నడిపించాడు పాంటింగ్.. సాధారణ జట్టుతో అద్భుతాలు చేశాడు దాదా. ఇద్దరూ గొప్ప కెప్టెన్లే అయినా.. జట్టుకు పోరాట స్ఫూర్తి నేర్పి, ఒక కొత్త నిర్మించిన గంగూలీనే ఒక మెట్టు పైన ఉంటాడు. పాంటింగే కాదు.. ప్రపంచంలోని మరే కెప్టెన్ కూడా ఈ విషయంలో దాదాతో పోటీ పడలేరు. ఎందుకంటే.. జట్టుకు ఎంతమంది కెప్టెన్‌గా ఉన్న.. దాదాగా నిలిచింది మాత్రం గంగూలీనే. అయితే.. ఐపీఎల్ 2008లో పాంటింగ్ సైతం గంగూలీ కెప్టెన్సీలో కోల్కత్తా నైట్ రైడర్స్‌కు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇద్దరూ ప్రత్యర్థులుగా ఉన్నా.. ఒకరిపై ఒకరికి అపార గౌరవం ఉంది. దాదా కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో పట్టుబట్టి పాంటింగ్‌ను టీమ్‌లోకి తీసుకునేలా చేశాడనే వార్తలు అప్పట్లో వచ్చాయి. అలాగే కేకేఆర్‌కు ఇద్దరు కెప్టెన్లు ఉన్నారని దాదా.. పాంటింగ్ ఉద్దేశించిన అన్నాడు. దీంతో వీరిద్దరి మధ్య ఎంత మంచి స్నేహవాతావరణం ఉందో అర్థం చేసుకోవచ్చు.
Ricky Ponting, Sourav Ganguly and Saeed Anwar jointly top the list.#Cricket #CricTracker pic.twitter.com/3h7T555BZb
— CricTracker (@Cricketracker) January 31, 2021
Two of the greatest captains of all-time- Ricky Ponting and Sourav Ganguly pic.twitter.com/Sbg1H2Vrko
— Sportskeeda (@Sportskeeda) June 26, 2016