కళ్ళల్లో కసి, ముక్కు మీద కోపం, పెదాలపై ఎప్పుడూ కనిపించని చిరునవ్వు, పంటి బిగువున ఉద్వేగం, గుండెల నిండా దేశభక్తి, ఓటమిని ఒప్పుకోలేని పోరాటం, ఆత్మగౌరవాన్ని చంపుకోలేని వ్యక్తిత్వం.. ఒక్కడిలో ఇన్ని లక్షణాలా? జెంటిల్‌మెన్ గేమ్‌లో ఇంత కటువైన, నిఖార్సయిన మనిషి ఉంటాడా? ఉంటాడు. అతని పేరు గౌతమ్ గంభీర్. ఒక మంచి ఆటగాడిగానే అతను చాలా మందికి తెలుసు. క్రికెట్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి కాసింత ఎక్కువగానే తెలిసి ఉంటుంది. కానీ.. మరికొంత మంది అతనో కోపిష్టి, ధోనిని ద్వేషించే వ్యక్తిగా చెబుతుంటారు. ధోని విషయంలో వారి మాట నిజమే. ధోనిని విమర్శిస్తూ గంభీర్ చాలా సార్లు తన అభిప్రాయాలను వ్యక్తపరిచాడు. అలాగే మైదానంలోనూ చాలా సీరియస్‌గా ఉంటాడు. కానీ.. అందంతా దేని కోసం? కచ్చితంగా అతని స్వార్థం కోసం మాత్రం కాదు. ఆట కోసం, దేశం కోసం. ధోనిని బహిరంగంగా విమర్శించినా, మైదానంలో కోపం ప్రదర్శించినా.. అతను ఏం చేసినా అది అతనిలోని దేశభక్తిని తెలియజేస్తుంది. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు.. మరింత లోతుగా విశ్లేషణలోకి వెళితే..
ధోనిపై విమర్శలు తన స్వార్థానికి కాదు..
టీమిండియా కెప్టెన్‌గా ధోని భారత్‌కు రెండు వరల్డ్ కప్‌ను అందించాడు. ఇండియన్ క్రికెట్‌లో అతనో దిగ్గజం, మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్.. అయినా కూడా గంభీర్‌కు ధోని అంటే నచ్చదు. ఎందుకంటే ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లను జిడ్డు ఇన్నింగ్స్‌తో చివరి వరకు తీసుకెళ్లి గెలిపించి క్రెడిట్ తీసుకుంటాడని.. అది డ్రెస్సింగ్ రూమ్ ఫ్రెండ్లీ నేచర్‌ను చెడగొడుతుందని గంభీర్ ఆవేదన. అలాగే 2007 టీ20 వరల్డ్ కప్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది యువరాజ్ ఆరు సిక్సులు, ఫైనల్‌లో జోగిందర్ శర్మతో ధోని చివరి ఓవర్ వేయించడం, శ్రీశాంత్.. మిస్బా ఉల్ హక్ క్యాచ్ అందుకోవడం, చివరికి రవిశాస్త్రి చేసిన కామెంట్రీ కూడా మనకు గుర్తుకు వస్తుంది. కానీ.. ఆ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ 75 పరుగులు చేసి టీమిండియా ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలిచాడన్న విషయం మాత్రం ఎవరీ గుర్తుండదు.
అలాగే 2011 వన్డే వరల్డ్ కప్ గురించి అడిగితే.. ధోని సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించడం, సచిన్‌ను భుజన ఎత్తుకుని గ్రౌండ్ చుట్టూ చిరగడం మాత్రమే గుర్తుకు వస్తాయి.. కానీ, శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో సచిన్, సెహ్వాగ్, కోహ్లీ వెంటవెంటనే అవుటైనా.. జెర్సీ మొత్తం మట్టి పోసుకుని చేసి 97 పరుగులతో టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన గంభీర పోరాటం మాత్రం గుర్తుండదు. మరో ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే.. 2007, 2011 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో గౌతమ్ గంభీరే టాప్ స్కోరర్. అయినా కూడా అతన్నో సాధారణ ప్లేయర్‌గానే చూస్తారు. తన కష్టం ఎక్కువగా ఉన్నా.. దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసిన విజయాలను ఏ ఒక్కరికో కట్టబెట్టడం సరికాదంటాడు గంభీర్. ఈ విషయంలో ధోనిపై విమర్శలు గుప్పిస్తాడు. తనకు క్రెడిట్ ఇవ్వాలని గంభీర్ ఏనాడు కోరలేదు.. ఒక టీమ్ విజయంగా చూడాలిని కోరాడు. ధోనిపై గంభీర్‌కు ఉండే కోపం ఈర్ష్య కాదు.. అందరికీ గుర్తింపు దక్కాలనే న్యాయమైన కోరిక. అలాగే ఇండియన్ క్రికెట్‌లో దిగ్గజ ఆటగాళ్లుగా ఉన్న యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లాంటి వారికి క్రికెట్ నుంచి ఒక మంచి ముగింపులేకుండా ధోని చేశాడనే కోపం గంభీర్‌లో కనిపిస్తుంది. తన గురించి ఎప్పుడూ పట్టించుకోని గంభీర్ తన తోటి దిగ్గజ ఆటగాళ్ల విషయంలో మాత్రం తన ఆవేదన, నిరసనను వ్యక్తం చేశాడు.
Gautam Gambhir – The Man of finals, The Man for big occasions. pic.twitter.com/MToj1Ltb0m
— CricketMAN2 (@ImTanujSingh) October 14, 2022
వినోదం కోసం కాదు.. దేశం కోసం ఆడాతాడు
‘క్రికెట్‌లో దేశభక్తి ఏముంది.. డబ్బులు ఇస్తున్నారు ఆడుతున్నాం’ అంటూ కొంత మంది అంతర్జాతీయ క్రికెటర్లే బహిరంగంగా ప్రకటనలు చేశారు. మనలో కూడా క్రికెట్‌ను వినోదం కోసం చూసే వారే ఎక్కువ. చాలా మంది క్రికెటర్లు సైతం క్రికెట్‌ను ఒక కెరీర్‌గానో, వినోదంగానో తీసుకుంటారు. కానీ.. ఒక్క గంభీర్ మాత్రం నేను ఒక క్రీడలో అంతర్జాతీయ వేదికపై నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను అనుకుంటాడు. అందుకే ఓటమిని అస్సలు జీర్ణించుకోలేడు. గంభీర్ ఎన్ని పరుగులు చేసినా.. ఎప్పుడూ సంతోషంగా ఉండడు అంటూ ఒకనొక సందర్భంలో టీమిండియా క్రికెటరే చెప్పాడు. తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను విజయం ముంగిట వదిలి వచ్చినా.. డగౌట్‌లో ప్యాడ్లు విప్పకుండా, కన్ను ఆర్పకుండా మ్యాచ్‌ను చూస్తాడు. విజయం సొంతమైన తర్వాతే రిలాక్స్ అవుతాడు. అప్పటి వరకు అతని కళ్లలో గెలవాలనే కసి కనిపిస్తూనే ఉంటుంది. ఏ దశలోనూ ఓటమిని ఒప్పుకోని నైజం గంభీర్ సొంతం. క్రికెట్‌ను కేవలం ఒక ఆటలానే కాదు.. దేశ ప్రతిష్టగా భావించి ఆడతాడు. అందుకే ప్రతిష్టాత్మక ఫైనల్స్‌లో ప్రాణం పెట్టి బ్యాటింగ్ చేస్తాడు.
క్రికెట్ తర్వాతి జీవితం కూడా దేశానికే అంకితం..
ఇండియన్ క్రికెట్‌కు ఒక ఆటగాడిగా తన వంత కృషి చేసిన గంభీర్.. భారత్‌కు రెండు వరల్డ్ కప్స్ అందించాడు. ఇక ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కూడా క్రికెట్‌తో టచ్‌లో ఉంటూనే.. తన జీవితాన్ని దేశానికి, ప్రజలకు అంకితం చేశాడు. బీజేపీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై చట్టసభల్లో ప్రజలకు ప్రతినిధిగా ఉన్నాడు. అలాగే తన సొంత పైసలతో ఢిల్లీలోని పేద వాడల్లో, రద్దీ ప్రాంతాల్లో రూ.5లకే భోజన క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తున్నాడు. ఈ ఆకలి తీర్చే సేవకు అతను ఎవరి నుంచి సాయం తీసుకోవడం లేదు.. కేవలం తన సొంత డబ్బుతోనే మంచి ఆహారం ప్రజలకు, అన్నార్థులకు అందిస్తున్నాడు. అలాగే క్రికెట్‌తో తన అనుబంధం కొనసాగిస్తూ.. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌గా మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. లెజెండ్స్ లీగ్‌తో కెప్టెన్‌గా ఇండియా క్యాపిటల్స్‌ను విజేతగా నిలిపాడు. అలాగే ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రెండు సార్లు కోల్‌కత్తా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఇన్ని చేసినా ఎప్పుడూ తన గురించి చెప్పుకోడు. దేశభక్తులంటే బార్డర్‌లో పహారా కాసే సైనికులలే కాదు.. అంతర్జాతీయ వేదికలపై దేశ గౌరవాన్ని పెంచిన గంభీర్ కూడా అసలు సిసలైన దేశభక్తుడే. అతను ఆడినా, గెలిచినా, మాట్లాడినా.. ఏం చేసినా దాని వెనుక దేశం అనే భావోద్వేగం ఉంటుంది. ఇండియన్ క్రికెట్‌లో నిజమైన వారియర్ గౌతమ్ గంభీర్.
Gautam Gambhir – The Man of finals, The Man for big occasions. pic.twitter.com/MToj1Ltb0m
— CricketMAN2 (@ImTanujSingh) October 14, 2022
2⃣4⃣2⃣ international matches 👍
1⃣0⃣3⃣2⃣4⃣ international runs 💪Here’s wishing the 2007 World T20 & 2011 World Cup winner, @GautamGambhir a very happy birthday. 🎂👏#TeamIndia pic.twitter.com/nGUlvYBUK6
— BCCI (@BCCI) October 14, 2022
One of the best edit 🤩🤩
Happy Birthday Gautam Gambhir sir ❤️❤️
: Collected from wp pic.twitter.com/V8dFWqZr7C— Kausik (Gautian) (@kousiks34307769) October 13, 2022
Happy Birthday mera Bhai @GautamGambhir
Keep doing all good work you do & inspire the nation.
Live long.#HappyBirthday #gautamgambhir pic.twitter.com/PSLskxkp8M— Munaf Patel (@munafpa99881129) October 14, 2022
Finally Your An
I N S P I R A T I O N 🧡
E M O T I O N 🤍
I D O L 💚Love You @GautamGambhir ♥️
Happy Birthday #GautamGambhir pic.twitter.com/EsJ68H9pAw— Sohail Khan ツ | #RC15™ (@alwayssohail) October 14, 2022