రవిచంద్రన్ అశ్విన్ పేరు చెప్పగానే అద్భుతమైన స్పిన్నర్ గుర్తొస్తారు. క్యారమ్ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్ ని బోల్తా కొట్టించడంలో మనోడు నంబర్ వన్! ఇక జడేజా-ఆశ్విన్ కాంబో అప్పుట్లో చాలా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఫామ్ కోల్పోయిన అశ్విన్.. పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు కాకుండా టెస్టులకే పరిమితమయ్యాడు. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్ జట్టులోనూ చోటు సంపాదించాడు. ఈ క్రమంలోనే అశ్విన్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన రవిచంద్రన్ అశ్విన్ 2009లో ఐపీఎల్ తో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఏడాదే జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. అప్పటినుంచి రెగ్యులర్ స్పిన్నర్ గా కొనసాగుతున్నాడు. గత కొన్నాళ్లలో జట్టులోకి వస్తూ పోతున్నాడు. ఇక టెస్టుల్లో ప్రస్తుతం 442 వికెట్లు తీశాడు. ఈ ఫార్మాట్ లో భారత్ తరఫున అత్యధిక వికెట్ల తీసిన వారిలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక వన్డేల్లో 151, టీ20ల్లో 61 వికెట్లు తీశాడు.
త్వరలో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇందుకోసం టీమిండియా జట్టు ప్రకటించగా, అందులో అశ్విన్ కి కూడా స్థానం దక్కింది. దీంతో జోష్ లో ఉన్న మనోడు.. తాజాగా చెన్నైలోని రోడ్డుపై అభిమానులతో కలిసి క్రికెట్ ఆడాడు. స్పిన్ బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని ఈఎస్పీఎన్ క్రికె ఇన్ఫో ఫేసుబుక్ లో షేర్ చేసింది. టీమిండియా క్రికెటర్ ఇలా ఆడటం చూసి అందరూ అతడిని మెచ్చుకుంటున్నారు. మరి అశ్విన్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఒక్క సెంచరీతో ర్యాంకింగ్స్ దుమ్ములేపిన కోహ్లీ! ఇక టాప్ లోకే!