డబ్ల్యూటీసీ ఫైనల్లో తుది జట్టులో అశ్విన్ కి చోటు దక్కని సంగతి తెలిసిందే. వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ కి ప్లేయింగ్ 11 లో స్థానం కల్పించకపోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బాగా హర్ట్ అయిన అశ్విన్..భారత జట్టు ప్లేయర్లపై షాకింగ్ కామెంట్స్ చేసాడు.
టీమిండియాకి ఏమైందో తెలియదు గాని గత రెండేళ్లుగా విజయాలకు దూరం అవుతూ వస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్ లో అదరగొట్టే మన వాళ్ళు చతికిలబడుతున్నారు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఆస్ట్రేలియా ఘోర ఓటమిని చవి చూసింది. ఈ నేపథ్యంలో టీమిండియాపై ఇప్పుడు మాజీల నుండి అభిమానుల వరకు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఐసీసీ టోర్నీలు గెలవకపోయినా.. ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ టీంని ఓడించాలంటే ప్రత్యర్థులకు చాలా కష్టమైపోయేది. కానీ ఇపుడు పరిస్థితి అలా లేదు. వీటికి కారణాలు ఏంటని పరిశీలిస్తే.. చాలానే ఉంటాయి. అయితే భారత ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ మాత్రం జట్టులో బాండింగ్ సరిగా లేకపోవడమేనని చెప్పుకొస్తున్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో తుది జట్టులో అశ్విన్ కి చోటు దక్కని సంగతి తెలిసిందే. వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ కి ప్లేయింగ్ 11 లో స్థానం కల్పించకపోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్ తీయగల అశ్విన్ ని పక్కన పెట్టి టీమిండియా తగిన మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా మీద అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న అశ్విన్ ని పక్కనపెట్టడమే టీమిండియా ఓటమికి కారణం అనే టాక్ కూడా నడిచింది. ఈ విషయంలో బాగా హార్ట్ అయిన అశ్విన్ ప్రస్తుతం టీమిండియా డ్రెస్సింగ్ వాతావరణం ఎలా ఉంటుందో తెలియజేశాడు. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఆడుతున్న అశ్విన్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు షాకింగ్ గా అనిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ.. “ఒకప్పుడు క్రికెట్ ఆడుతుంటే టీమ్‌లో అందరూ ఫ్రెండ్సే ఉండేవాళ్లు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనబడడం లేదు. టీమ్‌లో ఉన్న ప్రతీ ఒక్కరూ కూడా మిగిలిన వాళ్ల కంటే మనం ముందు ఉండాలనే ఆలోచనతోనే ఉంటున్నారు. ఒకరినొకరు ప్రశాంతంగా మాట్లాడుకునే సమయం కూడా ఉండడం లేదు. ఓ రకంగా టీమిండియా వాతావరణం ఇప్పుడు కార్పొరేట్ కల్చర్‌లా మారిపోయింది. నువ్వు ఇది చేయగలవనే చెప్పేవాళ్లు, ప్రోత్సహించేవాళ్లు లేరు. ఇప్పుడు సాయం చేసేవాళ్లు కానీ, సాయం చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు కానీ టీమ్‌లో లేరు. సాయం కావాలంటే అధికారులను కలవచ్చు కానీ ఆ అవసరం కూడా చూసుకునే బాండింగ్, ప్లేయర్ల మధ్య అవసరం” అంటూ కామెంట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్..