ప్రస్తుతం యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం ఆదివారం జరగబోయే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పైనే ఉంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తోనే ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం 90 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడైపోయాయి. అతి పెద్ద స్టేడియం అయిన మెల్‌బోర్న్‌లో ఈ క్రేజీ మ్యాచ్ జరగనుంది. కాగా.. ఈ మ్యాచ్ కోసం భారత్-పాక్ ఆటగాళ్లు ఫుల్‌గా ప్రిపేర్ అవుతుండగా.. అభిమానులంతా కూడా ఈ మ్యాచ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ.. మరో పక్క ఇరుదేశాల బోర్డులు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరిగనున్న ఆసియా కప్ 2023 కోసం ఆ దేశానికి టీమిండియా వెళ్లదని, పాక్‌లో కాకుండా వేరే ప్రత్యామ్నయ వేదికపై ఆసియా కప్ మ్యాచ్‌లు జరుగుతాయని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జైషా స్పష్టం చేశాడు. కానీ.. ఈ ప్రకటన కంటే ముందు టీమిండియా చాలా కాలం తర్వాత పాకిస్థాన్‌లో అడగుపెట్టబోతుందని, ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లకు దారులు తెరుచుకుంటాయని క్రికెట్ అభిమానులు ఆశపడ్డారు. కానీ.. జైషా ప్రకటనతో మళ్లీ పాత కథ అనుకున్నారు. ఇక బీసీసీఐ నిర్ణయంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అలకబూనింది. ఆసియా కప్ 2023లో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్థాన్ రాకుంటే.. అదే ఏడాది అక్టోబర్-నవంబర్ మధ్య భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 నుంచి తాము తప్పుకుంనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టమైన సమాచారం లేకపోయినా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ విషయంపై చర్చలు జరుపుతున్నట్లు పీటీఐ వెల్లడించింది. ఇండియా వేదికగా 2023లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. భారత్ కనుక ఆసియా కప్‌ను తమ దేశంలో ఆడకపోతే.. మేము కూడా భారత్‌కు వెళ్లి వన్డే వరల్డ్ కప్ ఆడేది లేదని పీసీబీ పెద్దలు భీష్మించుకుని కూర్చన్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే.. ఏడాది ముందే.. వన్డే వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ వాకౌట్ చేసినట్లు అవుతుంది. మరి ఈ సమస్యలకు ఎలాంటి పరిష్కరం దొరుకుతుందో వేచి చూడాలి.
Pakistan likely to pull out of the upcoming ODI World Cup in India, if India doesn’t travel to Pakistan for Asia Cup. (Reported by PTI).
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 18, 2022
Pakistan likely to boycott 2023 ODI World Cup if India doesn’t travel to Pakistan for Asia Cup 2023.
– By PRESS TRUST OF INDIA
— Avinash Aryan (@AvinashArya09) October 18, 2022
I think enough of politics. Sanity should prevail and BCCI shouldn’t forget that India is going to host World cup 2023. Teams want to play each others, Fans want to see India playing in Pakistan. Cricket deserves a better treatment.#India #Pakistan
— Suleman Raza MBE (@iamsulemanraza) October 18, 2022