క్రీడా ప్రపంచంలో ప్రతీ ఆటగాడికి ఫిట్ నెస్ ఎంతో ముఖ్యం. ఆటగాడు ఎంత ఫిట్ గా ఉంటే.. ఆటలో అంత బాగా రాణిస్తాడు. ఇక ఆటగాళ్లు వారి కెరీర్ లో గాయల బారిన పడటం, అనారోగ్యం పాలవడం సహజమే. ఈ క్రమంలోనే తాజాగా అనారోగ్యం బాగాలేక పాక్ స్టార్ బౌలర్ నసీమ్ షా ఆస్పత్రిపాలైయ్యాడు. ప్రస్తుతం పాకిస్థాన్ ఇంగ్లాండ్ తో 7 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యం కారణంగా అతడు మిగాతా మ్యాచ్ లకు అందుబాటులోకి వస్తాడో.. రాడో అనే అనుమానం ఉంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
నసీమ్ షా.. పాకిస్థాన్ యువ సంచలనం. తన బుల్లెట్ల లాంటి బంతులతో బ్యాట్స్ మెన్ కు దడపుట్టిస్తుంటాడు. నసీమ్ షా ఆసియా కప్2022లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్ తో టీ20ల్లోకి అరంగ్రేటరం చేశాడు. ఇక ఆసియా కప్ లో మంచి ప్రదర్శనతో 7 వికెట్లు తీసుకుని ఆకట్టుకున్నాడు. భారత్ తో మ్యాచ్ లో కాలికి గాయం అయినప్పటికీ ఆట మీద కసితో ఆడాడు. అదీ కాక శ్రీలంక బ్యాటర్ ను తన అద్భుత స్వింగ్ తో బౌల్డ్ చేయడంతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిలో పడ్డాడు. ప్రస్తుతం నసీమ్ షా తీవ్రమైన జ్వరం, ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాడని పాక్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించాడు. ప్రస్తుతం నసీమ్ షా లాహోర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నాడు.
ప్రస్తుతానికి అయితే షా కోలుకుంటున్నాడు అని.. రక్తపరీక్షల రిపోర్టులు వచ్చాకే అతడు మీగతా మ్యాచ్ లు ఆడతాడో.. లేదో తెలుస్తుందని ఆ అధికారి తెలిపాడు. ఈ నేపథ్యంలోనే అతడు తన అద్భుతమైన బౌలింగ్ తో త్వరలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ కు ఎంపికైయ్యాడు. తాజాగా జరుగుతున్న ఈ సిరీస్ లో ఇరు జట్లు 2-2తో సమంగా ఉన్నాయి. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా షా క్రికెట్ అరంగ్రేటరం చేశాడు. ఇక అదే సంవత్సరం శ్రీలంక తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 5 వికెట్లు తీసుకోవడంతో రెండో యంగెస్ట్ ప్లేయర్ గా ఈ ఘనత సాధించిన వారిలో నిలిచాడు. ఇక బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్ తీసి.. అతిపిన్న వయసులో హ్యాట్రిక్ తీసిన బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.
Naseem Shah at his best – stumps all over the place #PAKvSL #AsiaCup2022Final pic.twitter.com/eGgjPDcj1E
— Saj Sadiq (@SajSadiqCricket) September 11, 2022