క్రికెటర్లకు, సినిమా స్టార్లకు సంబంధించిన పర్సనల్ విషయాలపై అందరికి ఆసక్తే. అందులోనూ క్రికెటర్లు-సినీ స్టార్లు కలియతిరిగితే ఇంకేమైనా ఉందా! నానా రచ్చ చేస్తారు. అందుకే.. వీళ్ళు మూడో కంటికి తెలియకుండా పని కానిస్తుంటారు. తాజాగా, టీమిండియా యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ సైతం అలానే చేస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు. బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తో ఓ హోటల్ లో బసచేసిన గిల్, అక్కడినుంచి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తూ అందరికి దొరికిపోయాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా, శుబ్‌మన్ గిల్ గతంలో సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. సారా పెట్టిన పోస్టుపై గిల్, గిల్ పెట్టిన పోస్టులపై సారా చేసిన.. హార్ట్(లవ్) కామెంట్లే వీళ్లు పీకల్లోతు ప్రేమలో ఉన్నారనడానికి నిదర్శనం. ఈ ఇద్దరూ కలిసి గోవాలో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకరకాల వార్తలు వినిపించాయి. అయితే.. ఈ వార్తలపై అటు గిల్ కానీ, ఇటు సారా కానీ స్పందించలేదు. దీంతో అక్కడకి ఎండ్ కార్డు పడింది. ఇది వాస్తవమో కాదో.. తెలియనప్పటికీ.. తాజాగా గిల్ మాత్రం 2nd ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. సారా టెండూల్కర్‌కి బ్రేకప్ చెప్పిన గిల్, సారా ఆలీ ఖాన్ సారాతో ప్రేమాయణం మొదలెట్టేశాడు. ఎలాంటి దాపరికాలు లేకుండా చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నాడు.
Sara & Shubman Gill spotted together in Hotel & flight 👀 pic.twitter.com/AjVBCOaOTW
— Cricpedia (@_Cricpedia) October 13, 2022
సారా ఆలీ ఖాన్ తో ముంబైలో ఓ హోటల్లో బసచేసిన గిల్.. ఆపై ఇద్దరూ కలిసి ఒకే ఫ్లైట్‌లో పక్కపక్కన కూర్చొని వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. తిరిగితే తిరిగాడు కానీ, ఆమెతో తిరగడమేంటని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ కూతురైన సారా ఇప్పటికే హర్షవర్థన్ రాణా, కార్తీక్ ఆర్యన్, ఇషాన్ కట్టర్, వీర్ పహారియా వంటి బాలీవుడ్ నటులతో ప్రేమాయణం నడిపినట్లుగా వార్తలు రావడమే అందుకు కారణం. ఇంతమందితో బ్రేకప్ చెప్పేసిన సారా, గిల్‌ని కూడా ఇలాగే ‘గిల్లి’ వదిలి పెడుతుందా? లేక పెళ్లి దాకా తీసుకెళ్తుందా? అన్నది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.