రిషభ్ పంత్, ఊర్వశి రౌటేలా.. వీరిద్దరి మాటల యుద్ధం గురించి రోజూకో వార్త వస్తుంది. వీరి మధ్య జరుగుతున్న ఇష్యూ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే. ఏ యుద్ధమైన సాయంత్రం అయితే ఆపుతారేమో కానీ వీరి మధ్య గొడవ మాత్రం 24 గంటలు సాగుతూనే ఉంటుంది. మైదానంలో పులిలా గాండ్రించే పంత్.. ఊర్వశి ముందు మాత్రం మౌనంగా ఉండాల్సిన పరిస్థితి. పంత్ ఎంత సర్ధుకుని వెళ్తున్నా ఊర్వశీ మాత్రం పరోక్షంగా రెచ్చగొడుతుంది. ఇక్కడ యుద్ధమంతా ఊర్వశి వైపు నుంచే నడుస్తోంది. ప్రపంచ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా వెళ్లిన పంత్ ను అనుసరిస్తూ ఊర్వశి వెళ్లింది. పంత్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? అంటూ పలువురు ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వారి విమర్శలకు ఊర్వశి తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ముందుగా పంత్, ఊర్వశిల మధ్య గొడవకు కారణమైన విషయం గురుంచి రెండు ముక్కల్లో తెలుసుకుందాం. రిషభ్ పంత్ తన కోసం హోటల్ గదిలో గంటల తరబడి వేచియున్నాడని.. అదంతా తనతో సె* చేయడానికే అని ఓ ఇంటర్యూలో సంచలన ఆరోపణలు చేసింది ఊర్వశి రౌటేలా. ఆసియా కప్ ముందు సోషల్ మీడియా వేదికగా అతనితో వాగ్వాదానికి దిగింది. ఈ ఆరోపణలపై పంత్ కూడా స్పందించాడు. ‘పాపులారిటీ కోసం ఇంత దిగుజారుతారా?’ అంటూ పంత్ కౌంటరిచ్చాడు. ఈ మాటలకు రెచ్చిపోయిన ఊర్వశి.. ‘చోటు భయ్యా! బ్యాట్ బాల్ ఆడుకో. సైలెంట్‌గా ఉన్నానని అడ్వాంటేజ్ తీసుకోకు. నీ ఇజ్జత్ తీస్తా” అంటూ ఇన్‌స్టా గ్రామ్ లో రాసుకొచ్చింది. దాంతో మనోడు తనదైన శైలిలో ఎదో చిన్న కౌంటరిచ్చి ఊరుకున్నాడు.
కానీ, ఈ భామ మాత్రం ఊరుకోలే. పంత్ పై పరోక్షం నిత్యం ఏదో ఓ కామెంట్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూనే ఉంది. ఇటీవల ఈ ఊర్వశి ఆస్ట్రేలియాకు వెళ్తూ.. “నా ప్రేమను అనుసరిస్తూ ఆస్ట్రేలియాకి చేరుకున్నాను” అంటూ పోస్ట్ పెట్టింది. అంతే ఆ క్షణం నుంచి ‘స్టాకర్’ అంటూ ఊర్వశీపై ఒకటే ట్రోల్స్ చేస్తున్నారు. రిషభ్ పంత్ ను ఉద్దేశించే ఆమె ఆ పోస్ట్ పెట్టిందని, అతడి వేధిస్తోందంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తోన్నారు. పంత్ కు ఇష్టం లేకున్నా ఎందుకు అతడ్ని ఫాలో అవుతున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈక్రమంలో తనపై విమర్శల చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఈ భామ.
” మొదట ఇరాన్ లో , ఇప్పుడు భారత్ లో..నన్ను మాత్రమే నిందిస్తున్నారు. నేను ఎవ్వరినీ వేధించలేదు,కించపరచలేదు. ఏ వ్యక్తికీ వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు. అయినా, నన్నే టార్గెట్ చేస్తున్నారు” అంటూ ఊర్వశీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతంటితో ఆగకా.. స్టాకర్ అంటే అర్ధం ఏంటో ముందు తెలుసుకోండి అంటూ … గూగుల్ లో స్టాకర్ పదానికి మీనింగ్ సంబంధించిన స్క్రీన్ షాట్ ని షేర్ చేసింది. అనంతరం ఆస్ట్రేలియా మ్యాప్ షేర్ చేస్తూ.. ఇది మన ఇండియాలోని మీడియా కోసం. చూడండి.. ఆస్ట్రేలియా ఎంత పెద్దగా ఉందే అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. తాను ఆస్ట్రేలియాకు వెళ్లింది పంత్ కోసం కాదని పరోక్షంగా క్లారిటీ ఇచ్చిందన్నమాట! ప్రస్తుతం ఊర్వశి ఆస్ట్రేలియా అందాల్ని ఆస్వాదిస్తోంది.