టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ రెండు వరల్డ్ కప్‌లు అందించిన దిగ్గజ కెప్టెన్‌గా ఇండియన్ క్రికెట్‌లో ధోనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అతనికి కోట్లలో అభిమానులు ఉన్నారు. క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ ధోని అంటే తెలియకుండా ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. అంతర్జాతీయ క్రికెట్‌ను రిటైర్ అయినా కూడా ధోనికి ఇప్పటికీ అదే స్థాయలో పాపులారిటీ, ఆదరణ ఉన్నాయి. అంతటి స్టార్ క్రికెటర్‌కు తొలి సారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా మన రాష్ట్రంలోనే. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఎంఎస్ ధోని విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఆ విగ్రహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని ఐపీఎల్‌లో ఆడుతూ అభిమానులకు వినోదం పంచుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆస్థాన కెప్టెన్‌గా ఉన్న ధోని.. టీమిండియా జెర్సీలో ఎంత ఫేమసో.. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో అంత ఫేమస్. అందుకే విజయవాడలో ప్రతిష్టించనున్న విగ్రహం కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఎల్లో జెర్సీలోనే ఉంది. ఈ విగ్రహం ఏర్పాటుపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధోని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విగ్రహ ఫొటోలను ప్రముఖ స్పోర్ట్స్ వార్తా సంస్థ క్రిక్ ట్రాకర్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ధోని విగ్రహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ విగ్రహ ఏర్పాటుకు భారీగానే ఖర్చు అయినట్లు తెలుస్తుంది. విజయవాడలోని ధోని అభిమానులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
ధోని కెప్టెన్సీలోనే 2007లో తొలి టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్‌ను టీమిండియా సాధించిన విషయం తెలిసిందే. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్‌కు అందించాడు ధోని. ఇక ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్న ధోని.. మధ్యలో రెండేళ్లు సీఎస్‌కేపై నిషేధం విధించినప్పుడు రైజింగ్ పుణె సుపర్‌జెయింగ్స్‌కు ఆడాడు. ఇప్పటి వరకు చెన్నై సుపర్ కింగ్స్‌ను ఏకంగా నాలుగు సార్లు విజేతగా నిలిపాడు. ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు సీఎస్‌కే కెప్టెన్‌గా తప్పుకున్నా.. జడేజా గాయపడ్డంతో మళ్లీ ధోనికే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది సీఎస్‌కే మేనేజ్‌మెంట్. వచ్చే ఏడాది కూడా ధోని సీఎస్‌కే కెప్టెన్‌గానే బరిలోకి దిగనున్నాడు.
MS Dhoni’s statue in Vijayawada👌
📸: @TeluguMSDians pic.twitter.com/1PkoyyscrQ
— CricTracker (@Cricketracker) September 28, 2022
Thala MS Dhoni’s statue in Vijayawada. craze of MSD is unmatchable. pic.twitter.com/oyIaZkcD8x
— Angry Munda (@angrybanda) September 27, 2022
ఇది కూడా చదవండి: పాక్ ప్లేయర్ రిజ్వాన్ వరల్డ్ రికార్డును బద్దలుకొట్టిన సూర్యకుమార్ యాదవ్!