టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగులు చేసిన మిస్టర్ కూల్.. టీ 20ల్లో 7వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఇండియన్ వికెట్ కీపర్‌గా, ఓవరాల్‌గా ఆరో టీమిండియా క్రికెటర్‌గా నిలిచాడు. ధోని కంటే ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, రాబిన్ ఊతప్ప మాత్రమే టీ20ల్లో 7వేలకు పైగా పరుగులు సాధించారు. కాగా ఇప్పటివరకు మొత్తం 349 టీ20 మ్యాచ్‌లు ఆడిన ధోని 7వేల పరుగులు మార్కును అధిగమించాడు. కాగా టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ సూపర్ స్టార్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను టీ20ల్లో మొత్తం 14,562 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో పాక్ కు చెందిన షోయబ్ మాలిక్ రెండు, కీరన్ పొలార్డ్ మూడు, ఆరోన్ ఫించ్ నాలుగో స్థానంలో ఉన్నారు.
అలాగే ఈ మ్యాచ్‌లో 200 క్యాచ్‌ల మైలు రాయిని కూడా ధోని అందుకున్నాడు. ప్రిటోరియస్ బౌలింగ్‌లో డేంజరస్ క్వింటన్ డికాక్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్న ధోనీ టీ20 క్రికెట్‌లో 200 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనతను అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా ధోనీ రికార్డులకెక్కాడు. మరి ధోని సాధించిన రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కెప్టెన్‌గా జడేజా తత్తరపాటు! ధోకికే కోపం తెప్పించాడు
MS Dhoni completed 7000 runs in T20 cricket. #MSDhoni #Chennai #IndianT20League2022 #Cricket #Sky247 #Socialmedia pic.twitter.com/2qYzWxv0hX
— Sky247 (@officialsky247) March 31, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.