జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన టీమిండియా ఆటగాళ్లు ఒక్కొక్కరిగా ఇంగ్లాండ్ కౌంటీల్లో అరంగ్రేటం చేస్తున్నారు. మళ్ళీ దారిలోకి రావాలన్నా, మా ప్రదర్శన చూడు ఎంత గొప్పగా ఉందో అని సెలెక్టర్లకు చూపించాలన్నా, అక్కడ రాణించడమే తరువాయి. ఒకవేళ పుంజుకున్నారో అదృష్టం వరించడమే. ఎందుకంటే.. పేస్ పిచులకు వేదికలైన ఇంగ్లాండ్ పిచ్ లపై ఇండియా బౌలర్లు రాణించలేరు అన్న పేరుంది. ఈ తరుణంలో రాణించారంటే.. సెలెక్టర్ల దృష్టిలో పడినట్లే. అలాంటి అద్భుతమైన ప్రదర్శన చేసాడు.. టీమిండియా యువ బౌలర్. ఒకవేళ ఈ ప్రదర్శన ఒకరోజు ముందు చేసున్నా లేదా మ్యాచ్ ఒకరోజు ముందు జరిగున్నా.. టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉండేవాడేమో. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో చూద్దామా..
వైట్ బాల్ క్రికెట్లో జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో ఇంగ్లాండ్ కౌంటీల్లో ఎంట్రీ ఇచ్చిన సిరాజ్ బ్యాటర్లను గజగజ వణికించే ప్రదర్శన చేశాడు. వార్విక్షైర్ తరుపున ఆడుతున్న సిరాజ్, సోమర్సెట్తో జరిగిన మ్యాచ్లో 24 ఓవర్లలో 6 మెయిడిన్లతో 82 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. పాక్ బ్యాటర్ ఇమామ్ వుల్ హక్ని 5 పరుగులకే పెవిలియన్ చేర్చిన సిరాజ్, ఆపై.. జార్జ్ బార్ట్లెట్(12), జేమ్స్ రెవ్(0), లూయిస్ గ్రెగొరీ(60), జోష్ డేవి(21).. ఇలా ఒకరివెంట ఒకరిని పెవిలియన్ బాట పట్టించాడు. సిరాజ్ దెబ్బకు సోమర్సెట్ 219 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
Miyan Magic in County Cricket ✨
Mohammed Siraj takes 5-wicket haul for Warwickshire against Somerset! #CricTracker #MohammedSiraj #Warwickshire #CountyCricket #SOMvsWARKS #Cricket pic.twitter.com/gFTRCqoCvH
— CricTracker (@Cricketracker) September 13, 2022
భారత క్రికెట్ లో మహమ్మద్ సిరాజ్ ఓ సంచలనం అనే చెప్పాలి. ఒక ఆటోవాలా కొడుకు అని చెప్పుకునే స్థాయి నుంచి దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగాడు. ఐపీఎల్ ద్వారా అతను జీవితం ఒక్కసారిగా మారిపోయింది అని చెప్పాలి. ఏ ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా సిరాజ్ టీమిండియాలో అవకాశం దక్కించుకున్నాడో.. అదే ఐపీఎల్ 2022తో జట్టుకు దూరమై అవకాశాల కోసం ఎదరుచూస్తున్నాడు. గత కొంత కాలంగా సిరాజ్ నిలకడగా రాణించలేక పోతున్నాడు. ఒకవేళ అవకాశం వచ్చినా కూడా అది కేవలం 1, 2 మ్యాచ్ లకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇంగ్లాండ్ కౌంటీల్లో రాణించి.. సిరాజ్ జాతీయ జట్టులోకి పునరాగమనం చేయాలని మనమూ ఆశిద్దాం. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A memorable County debut for Siraj with a five-wicket haul. pic.twitter.com/tmXUh9S76X
— Johns. (@CricCrazyJohns) September 13, 2022