శ్రీలంక.. గత కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నపేరు. ఓ వైపు ఆర్థిక సంక్షోభం.. మరో వైపు రాజకీయ సంక్షోభం. ఇన్ని సమస్యలతో కొట్టు మిట్టాడుతోన్న లంకకు భారీ ఊరటనిచ్చింది ఆసియా కప్ టైటిల్. దాంతో ఒక్కసారిగా ఆదేశ ప్రజలు అన్ని కష్టాలను మర్చిపోయి.. క్రికెట్ యోధులకు ఘన స్వాగతం పలికారు. ఆసియా కప్ తో లంకలోకి అడుగు పెట్టిన క్రికెటర్స్ కు అద్బుతమైన స్వాగతం లభించింది. దేశ ప్రతిష్ఠను ప్రపంచ నలుమూలలా విస్తరించిన విజేతలకు హృదయ పూర్వకంగా జేజేలు పలికారు. ఓపెన్ టాప్ బస్ లో ఆసియా కప్ తో లంక క్రికెటర్లు సందడి చేస్తుంటే.. బైక్స్ పై ర్యాలీగా ముందూ.. వెనక.. జాతీయ జెండాలతో అభిమానులు సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
“ఎన్ని బాధలు ఉన్నాగానీ పైకి నవ్వుతూ కనిపించాలి” ఇది మనకు పెద్దలు చెప్పిన మాట. ఈ మాట అచ్చంగా శ్రీలంక ప్రజలకు సరిపోతుంది. ఎందుకంటే భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు ఒకవైపు.. దేశంలో రాజకీయ అనిశ్చితి మరోవైపు. దీంతో ఇతర దేశాల దగ్గర చేయి చాచే పరిస్థితి లంకలో చోటుచేసుకుంది. ఇన్ని కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాగానీ.. ఆసియా కప్ గెలిచిన ఆటగాళ్లకు వారు ఘన స్వాగతం పలకడంతో వారిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. దేశంలో అన్ని బాధలు ఉన్నాగానీ.. అవన్నింటినీ మరిచి విజేతలకు నీరాజనాలు పలకడం గొప్ప విషయం. ఎయిర్ పోర్ట్ లో ఆటగాళ్లకు పూల దండలు వేసి.. జాతీయ జెండాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ట్రోఫీతో ఓపెన్ టాప్ బస్సులో లంక ఆటగాళ్లు కప్ ను తమ అభిమానులకు చూపిస్తూ.. వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే శ్రీలంక ప్రభుత్వ అధికారులు వారికి అధికారిక లాంఛనాలతో కార్యాలయంలోకి తీసుకెళ్లారు. శ్రీలంక క్రికెట్ బోర్డును, ఆటగాళ్లను వారు సత్కరించారు. శక్తి వంచన లేకుండా పోరడి టైటిల్ ను కైవసం చేసుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు ఏ మాత్రం వారి ఆటపై ప్రభావం చూపకుండా లంక ఆటగాళ్లు చాలా జాగ్రత్త పడ్డారు. ఈ విషయంలో లంక ఆటగాళ్లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్నక్రీడాభిమానులు పొగుడుతున్నారు. ప్రస్తుతం లంక విజయోత్సవ ర్యాలీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి కడుపు నిండా బాధలను పెట్టుకుని విజేతలకు ఘన స్వాగతం పలికిన లంక అభిమానులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The #AsiaCup trophy is officially home! 🏆#RoaringForGlory pic.twitter.com/VXsbV2gzzm
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 13, 2022
📸 Snapshots from the #AsiaCup victory parade
#RoaringForGlory pic.twitter.com/ZGIEov8OxL— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 13, 2022