మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2022 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీని కోసం ఇప్పటికే టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది. అక్కడి లోకల్ టీమ్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. నేడు పాండ్యా తన 29వ ఏటా అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా తన కుమారుడిని తల్చుకుని భావోద్వేగానికి గురయ్యాడు. తన పుట్టిన రోజు సందర్భంగా తన కుమారుడిని మిస్ అవుతున్నట్లు తన ట్విట్టర్ అకౌంట్లో వీడియో పోస్టు చేశాడు. అందులో చిన్నారి పాండ్యా.. హర్దిక్ పాండ్యాకు బ్యాట్లు అందిస్తున్నాడు. తన చిన్నారే తనకు లభించిన బెస్ట్ గిఫ్ట్ అని పాండ్యా పేర్కొన్నాడు.
పాండ్యా పోస్టు చేసిన వీడియలో తన కుమారుడితో కలిసి ఇంట్లోనే క్రికెట్ ఆడుతున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను నెటిజన్లు పోస్టు చేస్తూ.. పాండ్యాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. ఈ నెల 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2022లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఐపీఎల్ 2022కు ముందు గాయం, పూర్ ఫామ్‌తో టీమిండియాలో స్థానం కోల్పోయిన పాండ్యా.. సర్జరీ తర్వాత ఐపీఎల్ 2022లో రీఎంట్రీ ఇచ్చాడు. కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్ వ్యవహరించి తొలి సీజన్లోనే ఆ జట్టును ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపాడు.
కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా నడిపించడంతో పాటు తాను కూడా బ్యాట్ అండ్ బాల్‌తో అద్భుతంగా రాణించాడు. కట్ చేస్తే.. తిరిగి టీమిండియాలోకి వచ్చేశాడు. పైగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. టీమిండియాకు ఒక నిఖార్సయిన ఆల్‌రౌండర్‌గా ఎదిగిన పాండ్యా.. టీ20 వరల్డ్ కప్‌లో జట్టులో తురుపుమొక్కగా మారనున్నాడు. పాండ్యా రాణింపుపైనే టీమిండియా విజయావకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. జట్టులో ఐదో బౌలర్ రోల్‌తో పాటు చివర్లో దినేష్కార్తీక్తో కలిసి మ్యాచ్‌ను ఫినిష్ చేసే బాధ్యత హార్దిక్ పాండ్యాపైనే ఉంటుంది.
Missing my boy a little bit more on my birthday ❤️ The best gift I’ve received 😘🥰🤗 pic.twitter.com/So6ddl4d4q
— hardik pandya (@hardikpandya7) October 11, 2022
ఇది కూడా చదవండి: అతను టీమ్‌లో లేకుంటే.. ప్రత్యర్థి దృష్టిలో టీమిండియా చిన్న టీమ్!