India Capitals vs Gujarat Giants: మనిషిలో సత్తా ఉన్నప్పుడు వయసుతో సంబంధం ఏముంది. క్రికెట్ కు కావాల్సింది ఇదే. చేతిలో బ్యాట్ ఉందా? బౌలర్లపై ఎదురుదాడికి దిగడమే. అందులోనూ భారీ ఖాయంతో దృడంగా కనిపించే విండీస్ ఆటగాళ్ల రూటే వేరు. వారు కొట్టే సిక్సర్లకు బౌలర్ల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్, ఆండ్రూ రస్సెల్.. అలాంటి కోవకు చెందినవారే. తాజాగా, విండీస్ మాజీ క్రికెటర్ ఆష్లే నర్స్ లెజెండ్స్ లీగ్ లో అలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఒకానొక సమయంలో సహనం కోల్పోయి.. తన సహా క్రికెటర్ అయిన ర్యాన్ ఎమ్రిట్ తో గొడవ కూడా పెట్టుకున్నాడు. ఆ వివరాలు..
భారత్ వేదికగా జరుగుతోన్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో సంచలనాలు నమోదవుతున్నాయి. వయసు మళ్ళినా.. మాజీ క్రికెటర్లలో ఆ జోరు మాత్రం తగ్గట్లేదు. ఇరు ఇన్నింగ్స్ లలో రెండు సెంచరీలు నమోదయ్యాయి. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆష్లే నర్స్ 43 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 103 పరుగులు నాటౌట్ విధ్వంసం సృష్టించాడు. 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇండియా క్యాపిటల్స్ కు ప్రాణం పోశాడు. నర్స్ మినహా మిగతావారెవరు పెద్దగా రాణించింది లేదు. గుజరాత్ జెయింట్స్ బౌలింగ్‌లో తిసారా పెరీరా, ఎమ్రిత్, అప్పన్న తలా రెండు వికెట్లు తీశారు.
A magnificent 100* with the bat, a crucial wicket with the ball. #AshleyNurse is the Boss of the match. Take a bow!@CapitalsIndia#BossLogonKaGame #LLCT20 #LegendsLeagueCricket pic.twitter.com/j9fyBJDHFv
— Legends League Cricket (@llct20) September 17, 2022
అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ 18.4 ఓవర్లలో టార్గెట్‌ను చేధించింది. ఐర్లాండ్ మాజీ కక్రికెటర్ కెవిన్ ఓబ్రెయిన్ 61 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగుల చేయగా.. పార్థివ్ పటేల్ 24, యష్‌పాల్ సింగ్ 21 పరుగులు చేశారు. ఇండియా క్యాపిటల్స్ బౌలింగ్‌లో ప్రవీణ్ తాంబే 3, లియామ్ ప్లంకెట్ 2, ఆష్లే నర్స్, మిచెల్ జాన్సన్‌లే తలా ఒక వికెట్ తీశారు. ఆష్లే నర్స్, కెవిన్ ఓబ్రెయిన్ సెంచరీలపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kevin O’Brien has played a spectacular knock for Gujarat Giants!#GujaratGiants #IndiaCapitals #LLC #Cricket #BetHive #AshleyNurse #KevinOBrien pic.twitter.com/SsrWGnk3H7
— BetHive (@The_BetHive) September 17, 2022
Kevin O Brien’s phenomenal century led Gujarat Giants to a victory by 7 wickets against India Capitals.#GujaratGiants #IndiaCapitals #LLC #Cricket #BetHive #AshleyNurse #KevinOBrien pic.twitter.com/6W5Q81554i
— BetHive (@The_BetHive) September 17, 2022