క్రికెట్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు సచిన్. ఆయన తర్వాత అంతలా పాపులర్ అయిన పర్సన్ మహేంద్ర సింగ్ ధోని.. అభిమానులు ముద్దుగా మిస్టర్ కూల్ అని పిలుస్తారు. ఎందుకంటే మ్యాచ్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాసరే చాలా కూల్ గా ఉంటాడు. బ్యాటర్లు, బౌలర్లని కరెక్ట్ గా ఉపయోగించి మన జట్టు గెలిచేలా చేస్తాడు. దీనికి తోడు ఐపీఎల్ లోనూ నాలుగుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ కప్పు కొట్టిందంటే దానికి కూడా కారణం ధోనీనే. తన ఇన్నేళ్ల క్రికెట్ కెరీర్ లో ధోనీ కోపం చూపించింది చాలా తక్కువ. ఇక కుటుంబానికి కూడా చాలా ప్రాధాన్యమిచ్చే ధోనీ.. భార్య, కూతురితోనే ఎక్కువగా గడుపుతాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో ధోని టాప్ లో ఉంటాడు. తక్కువ మాట్లాడే ధోని.. బయట కూడా సైలెంట్ గానే ఉంటాడు. సోషల్ మీడియాలో అయితే అస్సలు కనిపించడు. ఇక ధోని గురించి ఏ విషయం తెలుసుకోవాలన్నా సరే అతడి భార్య సాక్షి సింగ్ ఇన్ స్టా అకౌంట్ చూస్తే తెలిసిపోతుంది. ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలని ఆమె పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఓ పాత వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో ధోనీతో, సాక్షి గొడవ పడటం నెటిజన్స్ మాట్లాడుకోవడానికి కారణమైంది.
ఈ వీడియోలో ఏముందంటే.. ధోని, తన భార్య సాక్షి గురించి చెబుతూ ఆమె ఇన్ స్టా ఫాలోవర్ల సంఖ్యని పెంచుకునేందుకు ఇదంతా చేస్తుందని అంటాడు. అలా వీరిద్దరూ సరదాగా గొడవపడుతుంటారు. దీనిపై వెంటనే స్పందించిన సాక్షి… ‘నీ ఫ్యాన్స్ నన్ను కూడా ఇష్టపడుతుంటారు. నేను నీలో భాగమే బేబీ, స్వీటీ’ అని కొంటెగా బదులిచ్చింది. ఆమె ఆ మాట అనగానే.. అక్కడున్న వాళ్లందరూ నవ్వుతారు. మొత్తానికి ఈ వీడియో చూసిన ధోని ఫ్యాన్స్.. భార్యభర్తల గొడవ భలే క్యూట్ గా ఉందని కామెంట్స్ పెడుతున్నారు.
ఇక 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కి ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. మరో రెండేళ్లపాటు లీగ్ లో ఆడతాడు కూడా. ఇండియా టీమ్ లో ఆడకపోయినా సరే ధోని క్రేజ్, ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. వికెట్ కీపింగ్, మ్యాచులో ప్లానింగ్ గురించి టాపిక్ వచ్చినా ప్రతిసారి.. ధోనితో సదరు ఆటగాళ్లను పోల్చి చూస్తుంటారు. అంతలా ధోని ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. మరి ధోని-సాక్షి క్యూట్ గొడవపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
.@msdhoni : Dekho aapne Instagram ke followers badhne ke liye, ye sab kar rahe hai… @SaakshiSRawat : All your followers love me also no..
Check out the hilarious convo here!🤣#Dhoni #Sakshi #MahiWay ❤️😇 pic.twitter.com/B0VNZ4mUOH
— MS Dhoni Fans Official (@msdfansofficial) January 30, 2020
ఇదీ చదవండి: ఆసియా కప్ గెలవడంలో ధోనీదే కీలక పాత్ర! శ్రీలంక కెప్టెన్ చెప్పిన నిజాలు!