గత కొన్ని నెలలుగా టీమిండియా ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. మేజర్ టోర్నీలు అయిన ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లలో ఘోర పరాభవంతో టీమిండియాపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అదీకాక జట్టు సెలెక్షన్ కమిటీపై తీవ్రంగా మండిపడ్డారు క్రీడా దిగ్గజాలు. వరుసగా విఫలం అవుతున్న ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం.. నైపుణ్యం గల ఆటగాళ్లను పక్కన పెట్టడం ఏంటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరికొన్ని నెలల్లోనే ప్రపంచ కప్ జరగనుండటంతో.. జట్టు కూర్పుపై తీవ్ర మేధోమథనం జరుగుతోంది. ఏ ఆటగాడిని ఏ స్థానంలో ఆడించాలి అన్న ప్రశ్న ఇప్పుడు జట్టులో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే టీమిండియాకు మిడిలార్డర్ బ్యాటర్ గా అ తడే సమర్థుడు అంటున్నాడు స్టార్ ఫినిషర్ దినేష్ కార్తీక్.
గత కొంత కాలంగా టీమిండియా సెలెక్షన్ పై తీవ్రంగా విమర్శలు వస్తోన్నాయి. అయితే గత కొంతకాలంగా టీ20లు మాత్రమే ఆడుతున్న టీమిండియా.. వన్డేల్లోకి వచ్చే సరికి తడబడుతోంది. ఈ విషయం న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ తో వెల్లడైంది. మిడిలార్డర్ బ్యాటర్లు గా ఎవరిని ఆడించాలి అన్నది ప్రశ్నగా మారింది మేనేజ్ మెంట్ కు. అయితే వచ్చే 50 ఓవర్ల వరల్డ్ కప్ లో 5వ స్థానంలో వచ్చే మిడిలార్డర్ బ్యాటర్ టీమిండియాకు కీలకం కానున్నాడని స్టార్ ఫినిషర్ దినేష్ కార్తిక్ అన్నాడు. ఈ క్రమంలోనే మిడిలార్డర్ లో 5వ స్థానంలో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రముఖ పాత్ర వహిస్తాడని చెప్పుకొచ్చాడు డీకే. ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ క్రిక్ బజ్ తో డీకే మాట్లాడుతూ..
“గత కొన్ని నెలలుగా టీమిండియా మిడిలార్డర్ కూర్పులో మార్పులు మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే వచ్చే వరల్డ్ కప్ లో 5వ స్థానం కోసం రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నా అభిప్రాయం ప్రకారం ఈ స్థానానికి రాహులే బెస్ట్. 5వ స్థానంలో సమర్థవంతంగా బ్యాటింగ్ చేయగలడు రాహుల్” అని దినేష్ కార్తిక్ అన్నాడు. అయితే గత కొంతకాలంగా ఇటు కేఎల్ రాహుల్.. అటు రిషబ్ పంత్ లు కంటిన్యూస్ గా పరుగులు చేయడంలో విఫలం అవుతున్నారు. ఇక ప్రస్తుతం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. ఈ వన్డే సిరీస్ కు గాయం కారణంగా రిషబ్ పంత్ ను, అక్షర్ పటేల్ ను పక్కనపెట్టారు. కొత్త బౌలర్ కుల్దిప్ సేన్ జట్టులోకి అరంగ్రేటరం చేశాడు.
Dinesh Karthik believes that KL Rahul should get the nod ahead of Pant in the first ODI.#BANvINDhttps://t.co/YSGKij1pBb
— CricTracker (@Cricketracker) December 4, 2022