SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Kl Rahul Reacts Over Playing At No 5 Position In Odi

నన్ను ఆ స్థానంలోనే ఆడించాలని రోహిత్‌ ఫిక్స్‌ అయ్యాడు: రాహుల్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 13 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నన్ను ఆ స్థానంలోనే ఆడించాలని రోహిత్‌ ఫిక్స్‌ అయ్యాడు: రాహుల్‌

గత కొంతకాలంగా సరైన ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న టీమిండియా మాజీ వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఎట్టకేలకు ఒక మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. 64 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. గురువారం భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు లంకను తక్కువ స్కోర్‌కే ఆలౌట్‌ చేసినా.. భారత టాపార్డర్‌ బ్యాటర్లు శుబ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ విఫలం అవ్వడంతో మ్యాచ్‌ కాస్త టఫ్‌గా మారింది. ఈ క్రమంలో వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాతో కలిసి.. కేఎల్‌ రాహుల్‌ కీలక భాగస్వామ్యం నెలకొల్పడమే కాకుండా.. మ్యాచ్‌ చివరి వరకు నిలబడి మ్యాచ్‌ గెలిపించడంతో పాటు సిరీస్‌ విజయాన్ని సైతం అందించాడు.

అయితే.. కేఎల్‌ రాహుల్‌ను తుది జట్టులో ఆడించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. బంగ్లాదేశ్‌పై డబుల్‌ సెంచరీ కొట్టిన ఇషాన్‌ కిషన్‌ను సైతం పక్కన పెట్టి.. వికెట్‌ కీపర్‌ రూపంలో రాహుల్‌ను ఆడిస్తుండటంపై క్రికెట్‌ అభిమానులు మండిపడ్డారు. చాలా కాలంగా బ్యాటింగ్‌లో అత్యంత దారుణంగా విఫలం అవుతున్న రాహుల్‌.. కీపర్‌గానూ ఆకట్టుకునే ప్రదర్శన చేయడం లేదు. దీంతో.. రాహుల్‌ను టీమ్‌లో అనవసరంగా ఆడిస్తున్నారంటూ క్రికెట్‌ నిపుణులు సైతం అభిప్రాయపడ్డారు. కానీ.. వాటికి సమాధానంగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు రాహుల్‌. 103 బంతుల్లో 6 ఫోర్లతో 64 రన్స్‌ చేసి.. టీమ్‌ను ఆదుకున్నాడు.

kl rahul

Join Our Whatsapp Channel

అయితే ఈ మ్యాచ్‌ విజయం తర్వాత మీడియాతో మాట్లాడిన రాహుల్‌.. తాను ఐదో స్థానంలోనే బ్యాటింగ్‌కు రావడానికి కారణం వివరించాడు. ‘వన్డే టీమ్‌లో తనను ఐదో స్థానంలో ఆడించేందుకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పక్కా క్లారిటీతో ఉన్నాడు. అందుకు తగ్గట్లుగా ఆడేందుకు నేను ప్రయత్నిస్తున్నాను’ అని రాహుల్‌ పేర్కొన్నాడు. అయితే.. టీ20ల్లో రాహుల్‌ ఓపెనర్‌గా ఆడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో సిరాజ్‌ 3, కుల్దీప్‌ యాదవ్‌ 3, ఉమ్రాన్‌ 2, అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు. 216 పరుగుల టార్గెట్‌ను టీమిండియా 43.2 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి ఛేదించింది. రాహుల్‌ 64, హార్దిక్‌ పాండ్యా 36 రన్స్‌తో రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో రాహుల్‌ ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Averaging 54.25 at No.5 for India in ODIs, has KL Rahul made this spot his own in a World Cup year? 🤔#INDvSL pic.twitter.com/JPKzEqQUvX

— ESPNcricinfo (@ESPNcricinfo) January 12, 2023

Tags :

  • Cricket News
  • IND vs SL
  • KL Rahul
  • Rohit Sharma
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam