సినీ గ్లామర్, భారీ ఫ్యాన్ బేస్, సూపర్ టీమ్, పరుగుల వరద పారించే కెప్టెన్, కుంబ్లే లాంటి కోచ్ ఉన్నా కూడా పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్‌ను కొట్టలేకపోయింది. గత నాలుగు సీజన్లకు ఆ జట్టుకు కెప్టెన్ ఉన్న టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ గత ఐపీఎల్ సీజన్ తర్వాత ఆ జట్టు నుంచి బయటికి వచ్చేశాడు. 2022లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పంజాబ్ ఐపీఎల్ మెగా వేలానికి ముందు రాహుల్‌ను రిటేన్ చేసుకోవాలని భావించినా.. లక్నో ఇచ్చిన ఆఫర్ కారణంగానే రాహుల్ వెళ్లిపోయాడని విమర్శలు కూడా వచ్చాయి.
ఆ సమయంలో స్పందించని రాహుల్, పంజాబ్‌ను వీడడంపై ఎట్టకేలకు నోరు విప్పాడు. రాహుల్ మాట్లాడుతూ.. ‘‘నాలుగేళ్ల పాటు వారితో కలిసి ఉన్నాను. ఐపీఎల్ ప్రయాణంలో నేను కొత్తగా ఏం నిరూపించుకోగలనో చూడాలని భావించాను. నిజానికి ఈ నిర్ణయం చాలా కఠినమైనది. ఎందుకంటే సుదీర్ఘ కాలంగా నాకు పంజాబ్‌తో విడదీయలేని బంధం ఉంది. కానీ కొత్తగా ఏదైనా చేయాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని రాహుల్ అన్నాడు. కాగా రాహుల్‌ను లక్నో రూ.17 కోట్లకు ఐపీఎల్ వేలానికి ముందే పిక్ చేసుకుంది. తన కెప్టెన్సీతో పంజాబ్‌ను విజేతగా నిలపలేకపోయిన రాహుల్.. లక్నోను ఏ మేరకు నడిపిస్తాడో చూడాలి. మరి రాహుల్ చెప్పిన వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ ఏ ఫోన్ వాడుతాడో, దాని ధరెంతో తెలుసా?
#BubbleKiBaatein: Aa gaye hai humare Captain on board, taiyaar hai banane naye record 🏏🙌
Welcome aboard, Captain💪👑@klrahul11 #LucknowSuperGiants #KLRahul #TataIPL #Mindset pic.twitter.com/zpLzHTGEo4
— Lucknow Super Giants (@LucknowIPL) March 16, 2022
New colours, same commitment 🎯 pic.twitter.com/nZnggxtZXR
— K L Rahul (@klrahul11) March 20, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.