ఐపీఎల్ 2023 రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సారి బుమ్రా ఐపీఎల్ ఆడటం లేదు. అతను చాలా కాలంగా టీమిండియాలో కూడా లేడు. ఏడాది క్రితం భారత జట్టులో హీరోగా ఉన్న బుమ్రా.. ఇప్పుడు సోదిలో కూడా లేకుండా పోయాడు. ఒక ఆటగాడు డబ్బుకు ఎక్కువగా ఆశపడితే.. ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో బుమ్రా చక్కటి ఉదాహరణగా నిలుస్తాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
జస్ప్రీత్ బుమ్రా.. రెండేళ్ల క్రితం టీమిండియాకు కొండంత బలం. బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించిన స్టార్. మాజీ పేసర్ జహీర్ ఖాన్ తర్వాత.. భారత జట్టు దొరికిన పేస్ కింగ్‌గా పేరుపొందాడు. బూమ్ బూమ్ బుమ్రాగా వికెట్లను గాల్లో ఎగరేసిన బుమ్రా.. టెస్టులు, వన్డేలు, టీ20లు ఇలా ఫార్మాట్ ఏదైనా.. టీమిండియాకు ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. అతి తక్కువ కాలంలో బీసీసీఐ అన్యూవల్ కాంట్రాక్ట్‌ల్లో ఏ, ఏ ప్లస్ గ్రేడ్లు అందుకున్నాడు. బుమ్రా టీమ్‌లో ఉంటే.. తక్కువ స్కోర్ చేసినా గెలవచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. కానీ.. అదే క్రమంలో తనని తాను సరిగా కాపాడుకోలేక.. కేవలం పైసల కోసం ఎక్కువగా ఆశపడి.. ఇప్పుడు జట్టులో లేకుండా పోయాడు. టీమిండియా బౌలింగ్ ఎటాక్‌కు హీరోగా ఉన్న బుమ్రా.. ఇప్పుడు జీరోగా మారిపోయాడు.
గతేడాది సెప్టెంబర్‌లో బుమ్రా టీమిండియా తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. అంతకంటే ముందు జరిగిన ఆసియా కప్ 2022లో బుమ్రా ఆడలేదు. గాయం నుంచి కోలుకున్న బుమ్రా ఆ వెంటనే ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడాడు. కానీ.. మూడు మ్యాచ్ మధ్యలోనే గాయపడ్డాడు. ఆ తర్వాత నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన టీ20 వరల్డ్ కప్ 2022కు దూరం అయ్యాడు. ఆ తర్వాత పలు చిన్న చిన్న సిరీస్‌లతో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సైతం బుమ్రా దూరంగానే ఉన్నాడు. అదే ఆస్ట్రేలియాతో ఐపీఎల్ తర్వాత జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023లోనూ బుమ్రా ఆడే అవకాశం లేదు.
ఇలా టీమిండియా ఆడిన చాలా మ్యాచ్‌లకు గాయంతో దూరమైన బుమ్రా.. గాయం నుంచి కోలుకుని ఐపీఎల్‌లో ఆడబోతున్నాడనే వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా బుమ్రాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జాతీయ జట్టుకు ఆడమంటే గాయమనే బుమ్రా.. ఐపీఎల్‌కు మాత్రం రెడీ అయిపోతున్నాడంటూ క్రికెట్ అభిమానులు విరుచుకుపడ్డారు. కానీ.. న్యూజిలాండ్ వెళ్లి వెన్నుముకకు సర్జరీ చేయించుకున్న బుమ్రా ఐపీఎల్‌కు దూరం అయ్యాడు. అయితే.. తనపై వస్తున్న విమర్శల నుంచి తప్పించుకోవడానికి ఈ సారి బుమ్రా ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నాడని కూడా విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా.. బుమ్రా లాంటి బౌలర్ టీమిండియాకు దూరం అవ్వడం జట్టుకు పెద్ద దెబ్బే. అయితే.. ఆ లోటును షమీ, సిరాజ్‌లు దాదాపు కనిపించకుండా చేశారు. ఒక్క టీ20 వరల్డ్ కప్‌లో మినహా ఇస్తే.. దాదాపు ఎక్కడా కూడా బుమ్రా లేని లోటు కనిపించలేదు.
అర్షదీప్ సింగ్, షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లతో భారత పేస్ దళం మరింత మెరుగు అవుతుంది. ఈ క్రమంలోనే బుమ్రా అవసరం దాదాపు జట్టుకు లేకుండా పోతుంది. కొన్ని నెలల క్రితం టీమిండియాకు పెద్ద దిక్కుగా ఉన్న బుమ్రా ఇప్పుడు సోదిలోనే లేకుండా పోయాడు. అయితే ఇదంతా అతని స్వయకృత అపరాధమే అంటున్నారు విశ్లేషకులు. కేవలం పైసలకు కక్కుర్తి పడి ఐపీఎల్‌లో విరామం లేకుండా ఎడా పెడా మ్యాచ్‌లు ఆడటంతోనే బుమ్రాకు ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. వాస్తవానికి ఫాస్ట్ బౌలర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని, గాయాల బారినపడకుండా తమను తామే రక్షించుకుంటూ ఉండాలని, శరీరానికి రావాల్సినంత విశ్రాంతి ఇస్తేనే.. అది సాధ్యమవుతుందని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కానీ, బుమ్రా ఐపీఎల్‌లో డబ్బులకు ఎక్కువ ఆశపడి.. తన శరీరానికి భరించలేని శ్రమను ఇచ్చాడని అందుకే ఇప్పుడు ఇలా కెరీర్ నాశనం చేసుకున్నాడని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 UPDATE 🚨
👉 Mumbai Indians to name Jasprit Bumrah’s replacement within two days 🗣️
👉 Mumbai has shortlisted 2-3 young pacers to replace Bumrah in IPL 2023 📰#IPL2023 pic.twitter.com/Wl5kFW4QDH
— SportsBash (@thesportsbash) March 29, 2023