ఐపీఎల్ 2023 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి టీమ్‌తో బరిలోకి దిగుతుంది. మరి ఎస్‌ఆర్‌హెచ్‌లో బలం ఏంటి? అధిగమించాల్సిన చిన్న చిన్న బలహీనతలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం..
ఐపీఎల్లో ఒకసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుని పరిశీలిస్తే.. ప్రారంభంలో మంచి ప్రదర్శన కొనసాగించినా.. గత రెండేళ్లుగా తీవ్రంగా నిరాశపరుస్తోంది. వార్నర్, శిఖర్ ధావన్, బెయిర్‌స్టో లాంటి ప్లేయర్లను దూరం చేసుకోవడంతో చాలా బలహీనంగా తయారైంది. దీనికి తోడు ఇటీవలే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ విలియమ్సన్‌ని కూడా వదిలేసుకోవడంతో ఈ సారి ఈ హైదరాబాద్ జట్టు టైటిల్ గెలుస్తుందని ఆశలు వదిలేసుకున్నారు అభిమానులు. అయితే కుర్రాళ్లతో కూడిన సన్ రైజర్స్ టీమ్ ఈసారి రాణించి కప్ కొట్టగలదా? 2016 సీజన్ని మళ్ళీ పునరావృతం చేయగలదా ? ఈ టీం బలాలు, బలహీనతలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాటింగ్..
సన్ రైజర్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే కుర్రాళ్లతో చాలా పటిష్టంగానే కనిపిస్తుంది. ఈ సారి కొత్త కెప్టెన్ మార్కరం కెప్టెన్సీలో బరిలోకి దిగబోతుంది. ఓపెనర్లుగా మాయాంక అగర్వాల్, అభిషేక్ శర్మ రానుండడం ఖాయం. వీరి తర్వాత త్రిపాఠి, మార్కరం, బ్రూక్ ,గ్లెన్ ఫిలిప్స్, సుందర్ వస్తారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ జట్టులో ఉన్న బ్యాటర్లు అందరూ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉండడం విశేషం. మయాంక్ ఇటీవలే దేశవాళీలో డబుల్ సెంచరీతో సత్తా చాటగా.. త్రిపాఠి టీంఇండియాలో చోటు సంపాదించి అద్భుతమైన ఇన్నింగ్స్ తో మంచి టచ్ లో ఉన్నాడు. ఇక మార్కరం కెప్టెన్ గా, బ్యాటర్ గా అంతర్జాతీయ క్రికెట్లో అదరగొట్టి సన్ రైజర్స్ కెప్టెన్ అయ్యాడు. ఇక హ్యారీ బ్రూక్, ఫిలిప్స్, క్లాసన్ వీరి కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ లో ఉన్నారు. వీరందరూ అంచనాలకు తగ్గట్టు రాణిస్తే సన్ రైజర్స్ కి తిరుగుండదు. ఇక లోయర్ ఆర్డర్ లో సుందర్, మార్కో జాన్సెన్ కూడా బ్యాట్ ని ఝళిపించగలరు.
బౌలింగ్..
బౌలింగ్ లో కూడా సన్ రైజర్స్ బలంగానే కనిపిస్తుంది. స్టార్ పేసర్ భువనేశ్వర్ స్వింగ్ తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాడానికి రెడీగా ఉన్నాడు. వీరితో పాటుగా యార్కర్ల కింగ్ నటరాజన్, స్పీడ్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్ లతో ఫాస్ట్ బౌలింగ్ భీకరంగా కనిపిస్తుంది. ఇక వీళ్లతోపాటు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్ రాణిస్తే తిరుగుండదు. సుందర్, ఆదిల్ రషీద్ తో రూపంలో ఇద్దరు టాప్ స్పిన్నర్లు ఉండనే ఉన్నారు. వీరందరూ రాణిస్తే సన్ రైజర్స్ చాలా ఈజీగా ప్లే ఆఫ్ కి వెళ్లగలదు. డెత్ బౌలింగ్ విషయంలో కూడా సన్ రైజర్స్ ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక్కోసారి ఉమ్రాన్ మాలిక్ భారీగా పరుగులివ్వడం, నటరాజన్ ఉన్నట్టుండి లయ కోల్పోవడం లాంటివి సన్ రైజర్స్‌ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ విషయాల మీద కాస్త దృష్టి సారిస్తే సన్ రైజర్స్ కి టైటిల్ రావడం పక్కా. మొత్తానికి బ్యాటింగ్ లో బలంగా కనిపించినా అనుభవం లేకపోవడం, బౌలింగ్ లో కాస్త డెత్ బౌలింగ్ విషయంలో మెరుగవడం, మార్కరం ఒత్తిడికి లోనవకుండా కెప్టెన్సీ చేస్తే 2016 తర్వాత సన్ రైజర్స్ కి మరొక టైటిల్ రావడం ఖాయం. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
4⃣ days, #OrangeArmy. Just 4⃣ days 😍
BRB, controlling our excitement 🤩
Get your tickets now: https://t.co/PFL10D6hL7 🎟️#OrangeFireIdhi #IPL2023 pic.twitter.com/CY14Weqvaj
— SunRisers Hyderabad (@SunRisers) March 29, 2023