ఐపీఎల్ 2022లో మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ అద్భుత విజయం సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ తొలి మ్యాచ్‌లో ఓడి.. తర్వాత రెండు గెలిచి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. కాగా ఆర్‌ఆర్‌పై వచ్చిన థ్రిల్లింగ్ విక్టరీతో ఆర్సీబీ టీమ్ ఫుల్ ఖుషీలో ఉంది. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో పాటు జట్టు మొత్తం సంబరాల్లో మునిగి తేలింది.
అలాగే మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మాద్‌ను ఒక ప్రత్యేక పాటతో అభినందించింది. ఆటగాళ్ల సంబరాల వీడియోను ఆర్సీబీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. ఐస్ డబ్బాలపై దరువేస్తూ డుప్లెసిస్ అండ్ టీమ్ ఒక పాటను సూపర్‌గా పాడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది. జోస్ బట్లర్(47 బంతుల్లో 6 సిక్స్‌లతో 70 నాటౌట్) మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఆర్సీబీ 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్(23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 43 నాటౌట్), షెబాజ్ అహ్మద్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) అద్భుత బ్యాటింగ్‌తో ఆర్సీబీకి రెండో విజయం అందించారు.
ఇదీ చదవండి: మ్యాక్స్‌వెల్ వీపుపై కోహ్లీ బాక్సింగ్.. ఆపై మసాజ్! వీడియో వైరల్
RR v RCB: Dressing Room Celebrations
A special victory song, appreciation for DK & Shahbaz, a happy captain & his confident troop – we bring to you all the reactions from the dressing room after RCB’s nail-biting win against RR, on Game Day.#PlayBold #IPL2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/R5ne8BCBsa
— Royal Challengers Bangalore (@RCBTweets) April 6, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.