ఐపీఎల్‌లో అత్యధిక సార్లు విజేతగా నిలిచిన జట్టు ముంబై ఇండియన్స్, ఐపీఎల్ మొట్టమొదటి టైటిల్ గెలిచిన జట్టు రాజస్థాన్ మధ్య ఈ సీజన్‌లో తొలి పోరు జరగనుంది. ఐపీఎల్ 2022లో ముంబై తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడింది. రాజస్థాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. మరి ముంబై తొలి గెలుపు నమోదు చేస్తుందా..? లేక రాజస్థాన్ రెండో విజయం సొంతం చేసుకుంటుందా? తెలుసుకునేందుకు రెండు జట్ల బలాలు, బలహీనతలు పరిశీలిద్దాం..
ముంబై ఇండియన్స్..
ముంబైకు ప్రధాన బలం బ్యాటింగ్. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, పొలార్డ్‌కు తోడు ఈ మ్యాచ్‌తో సూర్యకుమార్ కూడా జట్టులో చేరనున్నాడు. ముంబై బ్యాటింగ్ లైనప్ దుర్బేధ్యంగా ఉంది. కానీ.. ఈ నలుగురిపైనే జట్టు ఆధారపడి ఉంది. తిలక్ వర్మ లాంటి యువ క్రికెటర్ మిడిల్డార్‌లో జట్టుకు ఉపయుక్తంగా ఉన్నాడు. ఇక బౌలింగ్‌లో.. బుమ్రా ఒక్కడే గట్టిగా కనిపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో డేనియల్ సామ్స్ బెంచ్‌కు పరిమితం కావచ్చు గత మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 14.25 సగటుతో 57 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ముంబై స్పిన్ బౌలింగ్ విభాగంలో సరైన బౌలర్ లేకపోవడం పెద్ద మైనస్.
రాజస్థాన్ రాయల్స్..
చాలా ఏళ్లుగా ఒక సాధారణ జట్టుగా పరిగణంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఈ ఏడాది మాత్రం అత్యంత పటిష్టంగా కనిపిస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ దుర్భేద్యంగా ఉంది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై 200 పైచిలుకు పరుగులు చేసిన రాయల్స్.. బౌలింగ్‌లో ప్రత్యర్థిని 150 పరుగుల లోపే కట్టడి చేశాడు. బ్యాటింగ్‌లో జోస్ బట్లర్, యువ క్రికెటర్ జైశ్వాల్, కెప్టెన్ సంజూ శాంసన్, దేవదత్త్ పడిక్కల్, హెట్‌మెయిర్, నాథన్ కల్టర్ నైల్‌తో మంచి డెప్త్ ఉంది. పైగా అందరూ ఫామ్‌లో ఉండడం ప్రత్యర్థికి ప్రమాదం. ఇక బౌలింగ్ విషయాన్ని వస్తే.. ఐపీఎల్‌లో ఏ జట్టుకు లేని బౌలింగ్ ఎటాక్ రాజస్థాన్ ఉందనిపిస్తుంది. పేస్‌లో ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ద్ కృష్ణ, కల్టర్ నైల్.. స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌తో రాయల్స్ బౌలింగ్ ఎటాక్ రాయల్‌గానే ఉంది. రాజస్థాన్‌లో పెద్దగా బలహీనతలు ఏమీ కనిపించడం లేదు.
పిచ్..
ఈ మ్యాచ్ నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం జరగనుంది. ఇది బౌన్సీ పిచ్. పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
హెడ్ టూ హెడ్
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో ముంబై 13 మ్యాచ్‌లు గెలుపొందగా, రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
ప్రిడిక్షన్..
ఇరు జట్ల బలాలు, బలహీనతలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిచే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నా.. బౌలింగ్‌లో రాయల్స్, ముంబై కంటే పటిష్టంగా కనిపిస్తుంది. మరి రాజస్థాన్ బౌలర్లు వారి స్థాయి తగ్గట్లు రాణిస్తే రెండో విజయం ఖాయం. మరి ఈ మ్యాచ్‌పై మీ అభిప్రాయాలను, ప్రిడిక్షన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
తుది జట్ల అంచనా..
ముంబై ఇండియన్స్.. రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, పొలార్డ్, మురగన్ అశ్విన్, మిల్స్, బుమ్రా, థంపి, సామ్స్
రాజస్థాన్ రాయల్స్.. సంజూ శాంసన్(కెప్టెన్), జోస్ బట్లర్, జైశ్వాల్, దేవదత్త్ పడిక్కల్, హెట్‌మేయర్, రియన్ పరాగ్, నాథన్ కల్టర్ నైల్, రవీచంద్రన్ అశ్విన్, యుజేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్.
Prepping for Game 2. In Mumbai. Against Mumbai. 👊#RoyalsFamily | #HallaBol | #MIvRR pic.twitter.com/zVLUHketeu
— Rajasthan Royals (@rajasthanroyals) April 1, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.