ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ వరుసగా ఎనిమిదో మ్యాచ్‌లో కూడా ఓడిండి. ఇప్పటికే ఏడు వరుస ఓటములతో ఐపీఎల్‌లోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్న ముంబై.. ఆ రికార్డును మరింత పటిష్టం చేసుకుంది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఓడింది. ప్రత్యర్థి కంటే బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్ ఒక ఫైటింగ్ టార్గెట్‌ను ఛేదించలేక చతికిల పడింది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో కూడా సెంచరీ బాదాడు. ఈ సీజన్‌లోనే ముంబైతో తొలి మ్యాచ్‌లో కూడా రాహుల్ సెంచరీ కొట్టాడు.
బుమ్రా మినహా బలహీనమైన బౌలింగ్ ఎటాక్ ఉన్న ముంబైపై సెంచరీలతో ఎటాక్ చేశాడు రాహుల్. దీంతో ఒక వైపు జట్టులోని మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్‌కు అవుట్ అవుతున్న ఒక్కడే చివరి కంటా నిలబడి ప్రత్యర్థికి 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాడు. ముంబై బ్యాటర్లు మాత్రం 20 ఓవర్లు ఆడి కేవలం 132 పరుగులే చేసి ఓటమిని చవిచూశారు. దీంతో ముంబైకు ఈ సీజన్‌లో వరుసగా ఎనిమిదో పరాజయం పొందింది. సగం లీగ్ ముగిసిన తర్వాత ముంబై ఖాతాలో ఒక్క పాయింట్ కూడా లేదు. ఇక ఈ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ ఇంటికి వెళ్లినట్లే. ఐపీఎల్ చరిత్రలో ఇంత త్వరగా ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ మరో చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నట్లే.
వేలంలో చేసిన తప్పిదాల వల్లే ఈ పరిస్థితి?ఈ ఏడాది బెంగుళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్.. కెప్టెన్ రోహిత్ శర్మ, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్‌లను రిటేన్ చేసుకుంది. మిగతా జట్టు కోసం ఐపీఎల్ వేలంలో పాల్గొన్న ముంబై ఇండియన్స్ తమ పాత టీమ్ మెంబర్ ఇషాన్ కిషన్ కోసం భారీగా ఖర్చుచేసింది. ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు వేలంలో ఏ ఆటగాడికి కూడా రూ.10 కోట్లకు మించి ఇవ్వలేదు. కానీ తొలి సారి ఇషాన్ కోసం రూ.15.25 కోట్లు పెట్టారు. ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ చేసిన మొదటి తప్పిదం ఇదే అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇషాన్‌కు అంత ధర ఇవ్వడంతో ఇతర మంచి ప్లేయర్ల కోసం బడ్జెట్ కోరతతో పోటీ పడలేకపోయారు. ఈ సీజన్‌లో ఇషాన్ కిషాన్ అట్టర్ ఫాప్ అవుతున్నాడు. అలాగే సరైన బౌలింగ్ విభాగాన్ని ఎంపిక చేసుకోలేకపోయారు. బుమ్రాను రిటేన్ చేసుకోగా.. అతనికి జోడీగా జోఫ్రా ఆర్చర్‌ను కొనుగోలు చేసినా.. దురదృష్టవశాత్తు అతను సీజన్‌కు అందుబాటులో లేడు. ఆర్చర్ ఉంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేది. అలాగే ముంబైలో గత సీజన్‌లో అద్భుతంగా రాణించిన ట్రెంట్ బోల్ట్‌ను తిరిగి కొనుగోలు చేస్తారని అంతా భావించారు. కాని అది జరగలేదు.ఇక నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం ముంబై ఇండియన్స్‌కు అతిపెద్ద లోటని చెప్పాలి. కేకేఆర్, రాజస్థాన్, గుజరాత్, ఆర్సీబీ లాంటి టీమ్స్‌లో మంచి స్పిన్నర్లు ఉన్నారు. కానీ వేలంలో ముంబై స్పిన్నర్లను ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు హైఎస్ట్ వికెట్ టేకర్‌గా యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు. అంటే ఈ సీజన్‌లో స్పిన్నర్ల ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ముంబై ఇండియన్స్ ముఖ్యంగా బలహీనమైన బౌలింగ్ ఎటాక్‌తోనే దారుణ ఓటములను చవిచూస్తుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న డేనియల్ సామ్స్ అత్యంత దారుణంగా విఫలం అయ్యాడు. అలాగే మురగన్ అశ్విన్ ఉన్నా.. కూడా అంత ప్రభావం చూపడం లేదు.
ఇలా ఐపీఎల్ వేలంలో జట్టు సమతుల్యంపై దృష్టి పెట్టకుండా ముంబై మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యమైన ధోరణి అవలంభించింది. దాని ప్రతిఫలంగానే ముంబై ఈ సీజన్‌లో ఇంటిబాట పట్టింది. మ్యాచ్ విన్నర్లు ఉన్నా.. ప్రత్యర్థిని నియంత్రిచే బౌలర్లు కూడా ఉండాలన్న కనీస క్రికెట్ సూత్రాన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ మరిచింది. బుమ్రా ఒక్కడే 20 ఓవర్లు బౌలింగ్ చేయడానికి వీలులేదనే విషయం బహుషా వాళ్లు మర్చిపోయి ఉంటారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతుంది. మరి ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎలాగో ప్లేఆఫ్స్‌కు చేరదు కనుగా.. మిగిలిన మ్యాచ్‌లలో బెంచ్‌కు పరిమితమైన యువ క్రికెటర్లకు అవకాశం ఇస్తుందో లేదో చూడాలి. మరి ముంబై దారుణ వైఫల్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్! IPLలోనే తొలి ప్లేయర్
Ishan kishan hitting boundaries 🔥 🥵 #MIvsLSG #MumbaiIndians #ishankisan pic.twitter.com/bwooOAdstE
— Swapna Maheswari (@SwapnaMaheswari) April 24, 2022
Points table of IPL 2022. 5 teams to have won 5 matches – GT, RCB, RR, SRH, LSG. pic.twitter.com/ObDOUPEKlv
— CricketMAN2 (@ImTanujSingh) April 24, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.