ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండయన్స్ ఈ సీజన్ కూడా ఓటమితోనే ప్రారంభించింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో వరుసగా ఆ జట్టు పదో సారి ఐపీఎల్‌ను ఓటమితోనే ప్రారంభించింది. ఓ దశలో ముంబై విజయం ఖాయంగా కనిపించినా అనూహ్య రీతిలో ఢిల్లీ బ్యాటర్లు లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ చెలరేగి ముంబైకి విజయాన్ని దూరం చేశారు. ముఖ్యంగా 18వ ఓవర్లో భారీగా పరుగులిచ్చిన డేనియల్ సామ్స్ ముంబై ఓటమికి కారణమయ్యాడు.
దీంతో డేనియల్ సామ్స్‌ను సోషల్ మీడియాలో ముంబై అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలంటే మరో 3 ఓవర్లలో 28 పరుగులు చేయాల్సిన సమయంలో డేనియల్ సామ్స్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బాల్ ఇచ్చాడు. అప్పుడు క్రీజులో లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ ఉన్నారు. ఇక డేనియల్ సామ్స్ వేసిన 18వ ఓవర్ తొలి బంతిని అక్షర్ పటేల్ సిక్సు బాదాడు. రెండో బంతికి సింగిల్ తీయగా.. లలిత్ యాదవ్ స్ట్రైకింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్ మూడో బంతిని సిక్సు బాదిన లలిత్ యాదవ్.. నాలుగో బంతిని ఫోర్ బాదాడు. ఐదో బంతికి సింగిల్ తీశాడు. ఇక ఆరో బంతిని అక్షర్ పటేల్ సిక్సు బాదేశాడు. ఆ ఓవర్లో వరుసగా 6 1 6 4 1 6 పరుగులు వచ్చాయి. అంటే ఆ ఒక్క ఓవర్లోనే 24 పరుగులు రావడంతో మ్యాచ్ ముంబై చేయి జారిపోయింది.
ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలోనే డేనియల్ సామ్స్ 57 పరుగులిచ్చి ఢిల్లీ గెలుపునకు సాయపడ్డాడు. డేనియల్ సామ్స్ ఈ చెత్త ప్రదర్శనపై ముంబై ఇండియన్స్ అభిమానులు మండిపడుతున్నారు. అతడి వల్లే ముంబై మ్యాచ్ ఓడిపోయిందంటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే తమ తొలి మ్యాచ్ ముంబై ఓడిపోయే సెంటిమెంట్‌ను రిపీట్ చేయడంలో సామ్స్ సక్సెస్ అయ్యడంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఆస్ట్రేలియాకు చెందిన డేనియల్ సామ్స్‌ను మెగా వేలంలో ముంబై ఇండియన్స్ 2 కోట్ల 60 లక్షల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: భవిష్యత్తులో టీమిండియాను నడిపించేది అతడే! తేల్చేసిన పాంటింగ్
Daniel Sams after MI vs DC match be like- pic.twitter.com/in4MBr8qh3
— Sakht.ppl (@sakht_ppl) March 27, 2022
Daniel sams is not a good bolwer
— Ashish Meena (@AshishMeena26) March 28, 2022
Yet again Daniel Sams proving that why you should NOT buy BBL frauds
— Yashraj (@cricyashraj) March 27, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.