ఐపీఎల్ 2022లో అద్భుతంగా రాణిస్తున్న యువ పేసర్ అర్షదీప్ సింగ్‌ను టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న ఈ బౌలర్ తన సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్స్‌లో పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో ప్రారంభం కానుంది. ఈ ఐసీసీ మెగా వీవెంట్ కోసం పటిష్టమైన జట్టును ఎంపిక చేయాలని సోషల్ మీడియాలో వేదికగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో రాణిస్తున్న యంగ్ టాలెంట్‌ను కచ్చితంగా ప్రొత్సహించి జాతీయ జట్టులో చోటు కల్పించాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ముఖ్యంగా అర్షదీప్ సింగ్‌కు టీమిండియా చోటు లభిస్తే టీ20 వరల్డ్ కప్‌లో జట్టుకు ఎంతో మేలు జరుగుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే ఈ సీజన్‌లో అర్షదీప్ చాలా బాగా రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన అర్షదీప్ 40 ఓవర్లు వేసి.. కేవలం 4 సిక్సులు మాత్రమే ఇచ్చాడు. పైగా ఈ ఐపీఎల్ సీజన్‌లో అతి తక్కువ సిక్సులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో అతనే నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అతని బౌలింగ్‌లో షాట్లు ఆడటం బ్యాటర్లకు అంత ఈజీగా లేదు. విదేశి ఆటగాళ్లు సైతం అర్షదీప్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడుతున్నారు. అందుకే అర్షదీప్‌కు టీమిండియాలో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని.. బుమ్రా, షమీలతో పాటు అర్షదీప్, ఉమ్రాన్ మాలిక్‌లను ఎంపిక చేయాలి అంతా కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: David Warner: వీడియో: విచిత్రమైన షాట్ ఆడిన వార్నర్! దీనికి మీరే పేరు పెట్టండి
Arshdeep Singh in death overs in this IPL 2022:-
•Balls – 48
•Runs – 50
•Economy – 6.1
•Bounderies conceded – 3Unbelievable. Best Bowler in death over in this IPL 2022 so far. pic.twitter.com/Q97cqnEFcT
— CricketMAN2 (@ImTanujSingh) April 29, 2022
Best economy in the death-overs in #IPL2022:
(min 10 overs)7.20 – Arshdeep Singh
8.12 – Jasprit Bumrah
8.58 – Bhuvneshwar Kumar
9.00 – Dwayne Bravo
9.46 – Mustafizur Rahman— CricTracker (@Cricketracker) May 3, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.