బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో భారత్‌తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రీషెడ్యూల్ అయిన ఈ టెస్టులో విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-2తో సమం చేసింది. కానీ.. ఈ టెస్టు విజయం తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్ల అత్యుత్యాహం, అహంకార పూరిత వ్యాఖ్యలు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ కోహ్లీని ట్రోల్ చేయడం చూసి కొంతమంది క్రికెట్ నిపుణులు, అభిమానులు అసలు ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఏం సాధించిందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ కేవలం ఐదు టెస్టుల సిరీస్‌ను సమం చేయగలిగింది. అది కూడా స్వదేశంలో జరిగిన సిరీస్. నిజానికి ఇది ఘనత కాదు. చావుతప్పి కన్నులొట్ట బోయిన పరిస్థితి.. అంటూ నెటిజన్లు ఘాటూగానే స్పందిస్తున్నారు.
నిజానికి ఇంగ్లండ్‌ను ఇంగ్లండ్‌లో ఓడించడం అంత సులభం కాదు. కానీ టీమిండియా ఈ సిరీస్‌లో గతేడాది రెండు మ్యాచ్‌లు గెలిచింది. అదే ఊపులో ఐదో టెస్టు కూడా జరిగి ఉంటే ఫలితం కచ్చితంగా వేరేలా ఉండేది. కానీ.. కరోనా కారణంగా ఆ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేశారు. కానీ నిబంధనల ప్రకారం ఏ మ్యాచ్ అయిన రద్దు అయితే అప్పటి వరకు సిరీస్‌లో ముందంజలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ లెక్కన నాలుగు టెస్టులు పూర్తి అయిన తర్వాత భారత్ 2-1తో ముందంజలో ఉంది. కానీ.. భారత్‌ను విజేత ప్రకటించేందుకు ఇంగ్లండ్ ససేమీరా ఒప్పుకోలేదు. సిరీస్‌ను అలాగే ఫలితం లేకుండా వదిలేసేందుకు సిద్ధపడింది కానీ.. ఇండియాను విజేతగా ప్రకటించేందుకు ఒప్పుకోలేదు. ఇక తప్పని పరిస్థితుల్లో మ్యాచ్ రీషెడ్యూల్‌కు బీసీసీఐ అంగీకరించింది. ఇప్పుడు ఈ చివరి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ గెలిచినట్టు ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేస్తుందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఎక్కడున్నారో గుర్తుందా?
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ దారుణంగా 7వ స్థానంలో ఉంది. టీమిండియా నాలుగో స్థానంలో ఉంది. ఈ విషయం మరిచి భారత్‌పై టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ గెలిచినట్లు అతి చేస్తుందంటూ ఇంగ్లండ్‌కు అభిమానులు చురకలు అంటిస్తున్నారు. ఇప్పటికీ భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశాలు ఉన్నాయని.. ఇంగ్లండ్ తల కిందకి చేసి కాళ్లు పైకి పెట్టి తపస్సు చేసినా.. వారికి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశం లేదనే విషయాన్ని గుర్తించాలని అంటున్నారు.
రోహిత్ జట్టులో లేడు.. కోహ్లీ ఫామ్‌లో లేడు..
గతేడాది ఈ సిరీస్‌లోని మొదటి నాలుగు మ్యాచ్‌లు ఆడినప్పుడు టీమిండియా పరిస్థితికి.. ఇప్పుడున్న పరిస్థితికి చాలా తేడా ఉంది. పైగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దురదృష్టవశాత్తు మ్యాచ్‌కు ముందు కరోనా బారిన పడటం.. టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లీకి బ్యాడ్ ఫేజ్ నడుస్తుండటం ఇంగ్లండ్‌కు కచ్చితంగా కలిసొచ్చిందని.. ఈ రెండిటిలో ఏ ఒక్కటి ఉన్నా కథ వేరుండేదంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇలా అదృష్టం కొద్ది అన్ని కలిసొచ్చి గెలిచిన ఉపయోగం లేని గెలుపుకే ఇంగ్లండ్ అతిగా సంబరపడిపోతుందని క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇంగ్లండ్‌ను ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
England celebrating equaling the series. Meanwhile there position in WTC points table. pic.twitter.com/cj8hS8CaXI
— Vinayak 💙 (@NextBiIIionairs) July 5, 2022