ఆటగాళ్లకు అత్యంత ముఖ్యమైనది ఫిట్నెస్. టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నా.. ఫిట్నెస్ లేకపోతే.. క్రికెట్ లాంటి ఉరుకులు పరుగుల ఆటలో రాణించలేరు. చాలా మంది క్రికెటర్లు అద్భుతమైన ప్రతిభ ఉన్నా.. సరైన ఫిట్నెస్ లేక తరచు గాయాల బారిన పడుతూ.. త్వరగానే కెరీర్‌ను ముగిస్తుంటారు. అయితే.. ఈ తరం క్రికెటర్లు ఆటతో పాటు ఫిట్‌నెస్‌పై కూడా మంచి శ్రద్ధవహిస్తున్నారు. రెగ్యులర్‌గా జిమ్ చేయడంతో పాటు మంచి డైట్ ప్లాన్‌ను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీని ఫిట్‌నెస్‌కు పెట్టింది పేరులా ఉంటాడు. అతని ఫిట్నెస్ లెవెల్స్‌ను అందుకునే క్రికెటర్ ఈ తరంలోనే లేడనే చెప్పాలి. శత్రు దేశం పాకిస్థాన్ క్రికెటర్లు సైతం ఫిట్నెస్ విషయంలో కోహ్లీని ఆదర్శంగా తీసుకుంటారు.
ఈ క్రమంలో విరాట్ కోహ్లీకి టీ20 వరల్డ్ కప్‌లో రెండు భారీ సిక్సులు సమర్పించుకున్న హరీస్ రౌఫ్ సైతం తన డైట్ ప్లాన్‌ను వివరించాడు. తన డైట్లో రోజుకు కచ్చితంగా 24 గుడ్లు తింటానని చెప్పాడు. బ్రేక్ ఫాస్ట్ సమయంలో 8, మధ్యాహ్నం లంచ్‌లో 8, రాత్రి డిన్నర్ టైమ్‌లో 8 గుడ్లు ఇలా.. మొత్తంగా 24 గుడ్లు ప్రతి రోజు తింటానని వెల్లడించాడు. అయితే.. తనకు క్రికెట్ అకాడమీకి వెళ్లిన తర్వాతే తనకు గుడ్లు తినే అలవాటు అయిందని చెప్పాడు. మొదటి సారి క్రికెట్ అకాడమీకి వెళ్లినప్పుడు అక్కడున్న గుడ్లు చూసి.. తాను ఒక పౌల్ట్రీ ఫామ్‌కు వచ్చిన ఫీలింగ్ కలిగిందని హరీస్ పేర్కొన్నాడు.
ఆ క్రికెట్ అకాడమీలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఆకిబ్ జావేద్ సలహా వేరుకు తన డైట్ ప్లాన్ మార్చుకున్నట్లు తెలిపాడు. అప్పుడు తన బరువు 72 కేజీలు ఉండేదని.. కానీ జావేద్ తన ఎత్తు చూసి.. హైట్ ప్రకారం 82-83 కేజీల బరువు ఉండాలని.. అందుకు తగ్గట్లు ఆయన తన డైట్ ప్లాన్ ప్రిపేర్ చేశారని వెల్లడించాడు. ప్రస్తుతం హరీస్ రౌఫ్ బరువు 82 కేజీలు ఉన్నట్లు చెప్పాడు. అయితే.. ఒక ఆటగాడికి ఫిట్నెస్ ఎంతో ముఖ్యమని, దాన్ని కాపాడుకుంటేనే ఆటగాడిగా రాణించగలమని రౌఫ్ పేర్కొన్నాడు. మరి రౌఫ్ డైట్ ప్లాన్‌లో 24 గుడ్లు నినడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
I Eat 24 Eggs A Day. Aqib Javed Had Given Me The Diet Plan: 8 Eggs For Breakfast, 8 For Lunch, And 8 For Dinner: Haris Rauf@AJavedOfficial#AAPakistan #Pakistan #HarisRauf #Diet #Cricket #PakvsNZ #Karachi pic.twitter.com/Tv4iHC8MCb
— all.about.pakistan (@Aboutpakistan90) January 9, 2023