నన్ను నెత్తిన పెట్టుకుంటే నీ గుండెని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అని చెప్తాది. అలా చెప్పేది ప్రేయసినో, భార్యనో కాదు. హెల్మెట్. అవును ఆ హెల్మెట్ ని నెత్తిన పెట్టుకుంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా ప్రాణాలతో బయటపడేస్తుంది. అయితే ఈ హెల్మెట్టే కాదు, క్రికెట్ గ్రౌండ్ లో క్రీడాకారులు ధరించే హెల్మెట్ లు కూడా ప్రమాదం నుండి కాపాడతాయి. ఆ హెల్మెట్టే లేకపోతే.. బంతి వేగానికి మొఖం పగిలిపోద్ది. అందుకే బ్యాటింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. అయితే బంతి హెల్మెట్ లోకి దూసుకెళ్తే ఏంటి పరిస్థితి? క్రికెట్ లో అప్పుడప్పుడు ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ చోటు చేసుకోవడం సహజమే. సెప్టెంబర్ 23న ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన 3వ టీ20 మ్యాచ్ లో కూడా ఇదే జరిగింది.
పాకిస్తాన్ లోని కరాచీలో ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లో ఇంగ్లాండ్ 2 మ్యాచులు గెలవగా, పాకిస్తాన్ ఒక మ్యాచ్ గెలిచింది. నిన్న జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 221 పరుగులు చేయగా.. పాకిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో కేవలం 158 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పాకిస్తాన్ మీద ఇంగ్లాండ్ 63 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ క్రీజులో నిలబడి ఉన్నాడు. అవతల పాకిస్తాన్ పేసర్ హరిస్ రౌఫ్ బౌలింగ్ వేస్తున్నాడు. బౌలర్ బంతి వేశాడు. అయితే అది బౌన్స్ అయ్యి హ్యారీ బ్రూక్ హెల్మెట్ లో ఇరుక్కుంది.
అంత వేగంగా బౌన్స్ అయ్యి వచ్చిన బంతిని బ్రూక్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా అతని హెల్మెట్ గ్రిల్స్ లో ఇరుక్కుంది. వెంటనే రౌఫ్.. హ్యారీ బ్రూక్ దగ్గరకు వెళ్లి కౌగిలించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీన్ చూసి నెటిజన్లు.. “హెల్మెట్ ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే బ్రూక్ మొఖం మిగిలిపోయేది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో బ్రూక్ 35 బంతుల్లో 81 పరుగులు చేసి నాటవుట్ గా నిలిచాడు. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హెల్మెట్ లో ఇరుక్కున్న బంతి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
“Caught in the grille”
Brook gets a hug from Rauf after the sharp bouncer 🤝#PAKvENG | #UKSePK pic.twitter.com/UZRljMQt9C
— Pakistan Cricket (@TheRealPCB) September 23, 2022