టీమిండియా అభిమానులు ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా చేతిలో తొలి ఓటమి పరాభవానికి రెండో టీ20లో ప్రతీకారం తీర్చుకున్నారని సంబరాలు చేసుకుంటున్నారు. జట్టు మొత్తం సమిష్టి కృషితో ఆస్ట్రేలియాని చిత్తు చేశారు. 8 ఓవర్లలో 91 పరుగులు లక్ష్యాన్ని 4 బంతులు మిగిలుండగానే ఛేదించారు. విరాట్ కోహ్లీ ప్రదర్శన పరంగా చూసుకుంటే కాస్త నిరాశ పరిచాడనే చెప్పాలి. 6 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో కేవలం 11 పరుగులే చేశాడు. జంపా వేసిన అద్భుతమైన బంతికి బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు. మ్యాచ్ విషయం పక్కన పెడితే వ్యక్తిత్వం పరంగా కోహ్లీ అందరి హృదయాలను దోచుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
విషయం ఏంటంటే.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లీ గ్యాలరీలో నిల్చుని అటు ఇటూ తిరుగుతూ మ్యాచ్ చూస్తున్నాడు. ఆ సమయంలో ఆర్సీబీ ఫ్యాన్స్ కోహ్లీని చూసి ఊగిపోయారు. ఒక్కరాసిగా ఆర్సీబీ, ఆర్సీబీ అంటూ నినాదాలు చేశారు. అయితే కోహ్లీ ఆ సమయంలో కాస్త అసంతృప్తి, ఇబ్బందిగా కనిపించాడు. తన ఒంటి మీద ఉన్నది టీమిండియా జెర్సీ అయితే ఆర్సీబీ అని నినాదాలు ఎందుకు చేస్తారంటూ సైగ చేశాడు. బీసీసీఐ లోగోని చూపించి అసంతృప్తి వ్యక్తం చేశాడు. కోహ్లీకి ఆర్సీబీ వంటి ఐపీఎల్ టీమ్ కంటే టీమిండియా అంటేనే ఎక్కువ అభిమానం, ప్రాధాన్యం కూడా అని చెప్పకనే చెప్పాడంటూ పొగిడేస్తున్నారు.
Captain @ImRo45‘s reaction ☺️
Crowd’s joy 👏@DineshKarthik‘s grin 👍
🎥 Relive the mood as #TeamIndia sealed a series-levelling win in Nagpur 🔽 #INDvAUS | @mastercardindia
Scorecard ▶️ https://t.co/LyNJTtl5L3 pic.twitter.com/bkiJmUCSeu
— BCCI (@BCCI) September 23, 2022
కోహ్లీని ఆర్సీబీని వేరు చేసి చూడలేం. విరాట్ కోహ్లీ అనగానే ఆర్సీబీ, ఆర్సీబీ అనగానే కోహ్లీ గుర్తు రావడం సహజమే. కానీ, ఒంటి మీద టీమిండియా జెర్సీ పెట్టుకుని ఆర్సీబీ నినాదాలను కోహ్లీ స్వీకరించకపోవడం చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. ఆస్ట్రేలియా బ్యాటర్లను కంట్రోల్ చేయడంలో కాస్త పట్టు తప్పిందనే చెప్పాలి. 8 ఓవర్లకు 90 పరుగులు చేశారు. ఛేజింగ్‌లో రోహిత్ శర్మ(46*) కెప్టెన్ ఇన్నింగ్స్ భారత్ కాపాడింది. ఆకర్లో దినేష్ కార్తీక్ ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో అద్భుతమైన ఫినిష్‌ని అందించాడు. ప్రస్తుతం సిరీస్ సమం అయ్యింది. హైదరాబాద్ లో జరగనున్న మూడో టీ20 నిర్ణయాత్మక మ్యాచ్‌గా మారింది. కోహ్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ పై సీరియస్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Keeping India over RCB. That’s King Kohli for you 🇮🇳❤️ pic.twitter.com/DrKpPigvkH
— Pari (@BluntIndianGal) September 24, 2022