టీమిండియా టీ20 తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరో అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో టీమిండియాకు వరుస సిరీస్‌లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు. టీమిండియా టీ20 క్రికెట్‌లో సాధించిన విజయాల్లో ఎక్కువ మ్యాచ్‌ల్లో భాగమైన క్రికెటర్‌గా ధోనిని పాండ్యా అధిగమించేశాడు. టీమిండియా ఇప్పటి వరకు హార్దిక్ పాండ్యా టీమిండియా టీ20ల్లో సాధించిన 59 మ్యాచ్‌ల్లో భాగమయ్యాడు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో హార్దిక్.. 58 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్న ధోనిని దాటేశాడు. టీమిండియా గెలిచిన టీ20ల్లో ధోని 58 మ్యాచ్‌ల్లో భాగస్వామిగా ఉన్నాడు. అందరి కంటే అత్యధికంగా టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ ఏకంగా 100 మ్యాచ్‌ల్లో భాగమయ్యాడు. ఆ తర్వాత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 75 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఆటగాడిగా టీమిండియా సాధించిన 58 విజయాల్లో భాగస్వామి అయినా.. పాండ్యా కెప్టెన్ కూడా మంచి విజయాలు సాధిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా వైఫల్యం తర్వాత.. టీ20 కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది బీసీసీఐ. టీ20 వరల్డ్ కప్ తర్వాత మూడు టీ20 సిరీస్‌లకు వరుసగా పాండ్యానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. మూడు సిరీస్‌ల్లోనూ టీమిండియాను విజేతగా నిలిపాడు. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు కూడా పలు మ్యాచ్‌ల్లో పాండ్యా భారత కెప్టెన్‌గా వ్యవహరించాడు. వరల్డ్ కప్‌లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి టీ20ల్లో యువ క్రికెటర్లకే ప్రాధాన్యత ఇవ్వాలని భావించిన బీసీసీఐ రోహిత్ శర్మను టెస్టులు, వన్డేలకు పరిమితం చేసి.. టీ20ల బాధ్యతను పాండ్యాకు అప్పగించింది. అలాగే మరో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీని సైతం టీ20లకు దూరంగా ఉంచుతోంది. కానీ.. టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. టోర్నీలోనూ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
కానీ.. బీసీసీఐ మాత్రం.. టీ20 బాధ్యతలను పూర్తిగా పాండ్యాకే అప్పగించింది. అయితే.. కెప్టెన్ పాండ్యా విజయాలు సాధిస్తున్నా.. చాలా తప్పులు చేస్తూ.. కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు క్రికెట్ అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కెప్టెన్సీ వచ్చిన తర్వాత పాండ్యాలో అహం బాగా పెరిగిందని, ఆటగాళ్లపై నోరు పారేసుకోవడంతో పాటు, చెత్త నిర్ణయాలు తీసుకుంటూ.. కొంతమంది ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తూ.. మరింత మందికి చాలా అన్యాయం చేస్తున్నాడంటూ అతనిపై విమర్శలు ఉన్నాయి. సంజు శాంసన్, పృథ్వీ షా విషయంలో పాండ్యా చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నాడంటూ క్రికెట్ అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి పాండ్యా కెప్టెన్సీతో పాటు ధోని రికార్డును బద్దలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ranchi’s homeboy with Hardik Pandya and boys!! 😬#MSDhoni #HardikPandya #IndianCricketTeam #INDvsNZ
— OneCricket (@OneCricketApp) January 26, 2023