మహిళా క్రికెట్‌కు ఎంతో మేలు చేసేదిగా ‘ఉమెన్స్ ప్రీమియర్ లీగ్’ను ప్రపంచ క్రికెట్ మొత్తం కొనియాడింది. ఐపీఎల్ ఎంత సక్సెస్ ఫుల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ క్రికెట్‌లో రిచెస్ట్ లీగ్‌గా నిలిచింది. చాలా మంది యువ క్రికెటర్ల జీవితాలను మార్చేసింది. చాలా మంది యువ క్రికెటర్ల నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు అలాంటి పెను మార్పును మహిళా క్రికెట్‌లోనూ తెచ్చేందుకు, ఉమెన్స్ క్రికెట్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు బీసీసీఐ ఉమెన్స్ ఐపీఎల్‌ను నిర్వహించనుంది. ఇప్పటికే డబ్ల్యూపీఎల్ కోసం ఐదు ప్రాంచైజ్‌ల నుంచి బిడ్లను సైతం ఆహ్వానించింది.
ఉమెన్స్ ఐపీఎల్ కోసం పెద్ద పెద్ద కంపెనీలు, మెన్స్ ఐపీఎల్‌లో ఉన్న బడా ఫ్రాంచైజ్‌లు సైతం ఉమెన్స్ లీగ్ జట్లు దక్కించుకునేందుకు పోటీ పడ్డాడు. ఎవరూ ఊహించని విధంగా భారీ ధర పెట్టి ఫ్రాంచైజ్‌లను దక్కించుకున్నాయి. 2008లో పురుషుల ఐపీఎల్ ప్రారంభం సమయంలో వచ్చిన ధర కంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో జట్లను దక్కించుకోవడానికి వచ్చిన ధర అధికంగా ఉంది. అప్పుడు 8 ఎనిమిది జట్లు, ఇప్పుడు కేవలం 5 జట్లు మాత్రమే అయినా కూడా ధర భారీగా వచ్చింది. ఉమెన్స్ ఐపీఎల్ కోసం వచ్చిన బిడ్ ధర చూసి.. ప్రపంచం నివ్వెరపోయింది. అహ్మదాబాద, ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, లక్నో జట్లకు పెద్ద పెద్ద కంపెనీలు బిడ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ, బెంగుళూరు, ముంబై జట్లను ఇప్పటికే పురుషుల ఐపీఎల్‌లో జట్లను కలిగి ఉన్న కంపెనీలే దక్కించుకున్నాయి.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. తాజాగా డబ్ల్యూపీఎల్‌పై ప్రస్తుతం ఇతర దేశాలు అక్కసు వెళ్లగక్కుతున్నాయి. ఈ నెల 10 నుంచి ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 ప్రారంభం కానుంది. అలాగే ఈ నెల 13న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 మెగా వేలం నిర్వహించనున్నాయి. ఈ వేలంలో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది మహిళా క్రికెటర్లు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో కొంతమందిపై కాసుల వర్షం కురవనుంది. అలాగే మరికొంతమందికి నిరాశే మిగలనుంది. ఇప్పుడు ఇదే విషయంపై వివిధ దేశాలు బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ నడుస్తున్న సమయంలో ప్లేయర్ల ఏకాగ్రతను దెబ్బతీసే వేలం నిర్వహించడం కరెక్ట్ కాదని అంటున్నారు.
టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న వివిధ దేశాల ప్లేయర్లు సైతం డబ్ల్యూపీఎల్ వేలంలో పాల్గొంటున్నారు. వారిలో కొంతమంది భారీ ధర వస్తే.. వారు సంతోషంతో ఉప్పొంగిపోతారు. అలాగే ఆశించిన ధర రాకున్నా.. వేలంలో అమ్ముడుకాకపోయినా.. ఆయా క్రికెటర్ల కాన్సట్రేషన్ దెబ్బతినే అవకాశం ఉంది. అది వారి ఆటతీరుపై ప్రభావం చూపుతుంది. దీంతో వరల్డ్ కప్‌లో మొత్తంగా జట్టు ప్రదర్శనపై, విజయావకాశాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇదే విషయంపై విదేశీ క్రికెట్ బోర్డులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టీమిండియా ప్లేయర్లు కూడా ఈ వేలంలో పాల్గొంటున్నారు కదా? అని అనుకోవచ్చు. ఇండియన్ ప్లేయర్‌కు కచ్చితంగా ఈ వేలంలో మంచి డిమాండ్ ఉంటుంది.
జాతీయ జట్టుకు ఆడుతున్న ప్లేయర్లంతా కచ్చితంగా అమ్ముడైపోవడం ఖాయం. ఎందుకంటే.. 5 జట్లలో 6 స్వదేశి ప్లేయర్ ఉండాలి. దీంతో.. ఇండియన్ ప్లేయర్లకు డిమాండ్ ఉంటుంది. దీంతో.. వేలం ప్రభావం ఇండియన్ క్రికెటర్లపై తక్కువ ప్రభావమే చూపుతుంది. చాలా మంది విదేశీ ప్లేయర్లకు మాత్రం నిరాశ తప్పదు. అయితే.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనడం కంటే దేశం తరఫున ఆడటం, కప్ గెలవడమే ముఖ్యమని అనుకుంటే.. లీగ్ పాల్గొనకుండా ఉండాలి కానీ.. లీగ్‌పై అక్కసు వెళ్లగక్కడం సరికాదని క్రికెట్ అభిమానులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండియాలో నిర్వహించే ఈ డబ్ల్యూపీఎల్‌కు వస్తున్న ఈ భారీ స్పందన చూసి విదేశీ బోర్డులు తట్టుకోలేకపోతున్నాయనే వాదన కూడా ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The #WPLAuction is coming on February 13 ⏳ pic.twitter.com/BZ2GNuAntc
— ESPNcricinfo (@ESPNcricinfo) February 5, 2023