దాదాపు 17 ఏళ్ల తర్వాత.. టెస్టు క్రికెట్ ఆడేందుకు పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. సంచలన విజయం నమోదు చేసింది. రావాల్పిండి వేదికగా ఈ నెల 1న ప్రారంభమైన తొలి టెస్టుల్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఏకంగా నాలుగు సెంచరీలతో పాటు తొలి రోజే 506 పరుగులు చేసి చర్రిత సృష్టించింది. మొత్తం మీద తొలి ఇన్నింగ్స్‌లో 657 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, హెర్రీ బ్రూక్ సెంచరీలో కదం తొక్కారు. పాకిస్థాన్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు ధీటుగా బదులిచ్చింది. పాక్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో 579 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాక్ ఓపెనర్లతో పాటు కెప్టెన్ బాబర్ అజమ్ సైతం సెంచరీ బాదాడు.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయినా వేగంగా ఆడి 264 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో పాక్ ముందు 342 పరుగుల టార్గెట్‌ను ఉంచి.. బెన్ స్టోక్స్ రిస్క్ తీసుకున్నాడు. తొలి రెండు రోజులు చూస్తే.. ఈ మ్యాచ్ ఫలితం తేలదని అంతా భావించారు. కానీ ఇంగ్లండ్ అగ్రెసివ్ క్రికెట్, కెప్టెన్ బెన్ స్టోక్స్ డేరింగ్ డిసిషన్‌తో.. పాక్‌కు తక్కువ టార్గెట్ ఇచ్చి.. రెండో ఇన్నింగ్స్‌తో 268 పరుగులకే ఆలౌట్ చేసి ఇంగ్లండ్ 74 పరుగులతో తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో ఉంది. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లు జెమ్స్ అండర్సన్, రాబిన్‌సన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారిద్దరూ చెరో 4 వికెట్లు పడగొట్టారు. బెన్ స్టోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ తీసుకున్నారు.
కాగా.. ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. హిస్టారిక్ టెస్టుగా చెప్పుకుంటూ.. కనీసం డీఆర్‌ఎస్, స్పీడో మీటర్ కూడా ఏర్పాటు చేయలేదంటూ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక రావాల్పిండి పిచ్ అయితే.. కేవలం బ్యాటింగ్ కోసం మాత్రమే తయారు చేసినట్లు ఉందని తొలి రెండు రోజుల్లో అర్థమైంది. బ్యాటర్లు చాలా సులువుగా బంతిని బౌండరీలు బాదుతూ.. సెంచరీల మోతమోగించారు. కానీ.. ఇలాంటి పిచ్‌పై కూడా ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. పాక్‌ను ఊరించే టార్గెట్ ఇచ్చి.. కాస్త రిస్క్ చేసిన ఇంగ్లండ్, చివరికి 74 పరుగులతో మ్యాచ్‌ను కైవలం చేసుకుంది. మరోసారి టెస్టు క్రికెట్ మజాను క్రికెట్ అభిమానులకు అందించింది. టెస్టు క్రికెట్‌ను వినోదాత్మకంగా మారుస్తామని చెబుతున్న ఇంగ్లండ్ టీమ్.. అందుకు తగ్గట్లే ఆటలోనూ చూపిస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.
Luck only favors the bravest 👊🏻
One of the best wins in Test cricket 🏴#crickettwitter #engvspak pic.twitter.com/XecJ6PnUd5
— Sportskeeda (@Sportskeeda) December 5, 2022
The final wicket to fall.
Well played, @englandcricket#PAKvENG | #UKSePK pic.twitter.com/Rq3zFvPJSp— Pakistan Cricket (@TheRealPCB) December 5, 2022