ఆసియా కప్ 2022.. ప్రస్తుతం అందరి చర్చ కింగ్ విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీ గురించే. కానీ ఆసియా కప్ సూపర్-4 లో భాగంగా ఆఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. దానికి వేదికగా నిలిచాడు భారత డాషింగ్ ఫినిషర్ దినేశ్ కార్తీక్. ఏ జట్టైనా సిరీస్ సాధించిన తర్వాత జరిగే నామమాత్రపు మ్యాచ్ ల్లో ప్రయోగాలు చేయడం సహజమే. అందులో భాగంగానే ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా చివర్లో ఓ ప్రయోగాన్ని చేసి వార్తల్లో నిలిచింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
దినేశ్ కార్తీక్.. భారత జట్టులో మంచి ఫినిషర్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ధోని తర్వాత అలాంటి మ్యాచ్ ఫినిషర్ లు టీమిండియాలో లేరనే చెప్పాలి. ఆ తర్వాత ఆ మ్యాచ్ విన్నర్ పాత్రను దినేశ్ కార్తీక్ తీసుకున్నాడు. అటు వికెట్ కీపర్ గా.. ఇటు ఫీల్డర్ గా తన సేవలను అవసరం అయినప్పుడు జట్టుకు అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే డీకే మరో కొత్త అవతారం ఎత్తాడు. అదేంటంటే? డీకే బౌలర్ గా మారాడు. తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో మెుదటి సారి బౌలింగ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ సెంచరీతో భారత్ 2 వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్గాన్ ను భువనేశ్వర్ కుప్పకూల్చాడు. దాంతో భారత విజయం ఖాయం అయ్యింది. ఈ నేపథ్యంలోనే తాత్కాళిక కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రయోగాలు చేశాడు. ఎలాగో మ్యాచ్ భారతే గెలుస్తోందని తెలుసు కాబట్టే డీకే చేత బౌలింగ్ చేయించాడు.
ముఖ్యంగా దినేశ్ కార్తీక్ చేత బౌలింగ్ చేయించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ ను డీకే స్పిన్ వేశాడు. ఐతే వికెట్ ఏమీ తియ్యకుండానే 18 పరుగులను సమర్పించుకున్నాడు. 2004 నుంచి భారత్ కు ఆడుతున్న డీకే ఇప్పటి వరకు బౌలింగ్ చేసిన దాఖలాలు లేవు. ఎలాగో భారత్ గెలుస్తుంది అన్న నమ్మకంతోనే అతడి చేత బౌలింగ్ వేయించారు. ఐతే మనం ధోని, విరాట్, కోహ్లీ, మిగతా భారత ఆటగాళ్లు బౌలింగ్ చేయడం మనం గతంలో చూశాం. కానీ వికెట్ కీపర్ల చేత బౌలింగ్ చేయించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఏదిఏమైనప్పటికీ డీకే కు అనుకుంత అవకాశాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి. ప్రస్తుతం అతడు బౌలింగ్ చేసిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరి డీకే బౌలింగ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) September 9, 2022