ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ శ్రీలంక 2022లో భాగంగా జరిగిన రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమం అయ్యింది. గల్లేలో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక- ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇన్నింగ్స్, 39 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ రెండో టెస్టు శ్రీలంక విజయంలో దినేశ్ చండీమల్ డబుల్ సెంచరీ ఎంతో దోహదం చేసిందని చెప్పొచ్చు. ఒక్క నిస్సంక మినహా శ్రీలంక టాపార్డర్ బ్యాటర్లు అంతా హాఫ్ సెంచరీ నమోదు చేయడం విశేషం.
ఈ మ్యాచ్ లో దినేశ్ చండీమల్ 326 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో మొత్తం 206 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో దినేశ్ చండీమల్ డబుల్ సెంచరీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అంతేకాకుండా దినేశ్ చండీమల్ బ్యాటింగ్ సమయంలో జరిగిన ఒక ఫన్నీ సన్నివేశానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Amazing display by @OfficialSLC congrats to @IamDimuth , Dinesh Chandimal, Prabath Jayasuriya and the entire team for the outstanding win.
— Kumar Sangakkara (@KumarSanga2) July 11, 2022
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 179వ ఓవర్ వేసేందుకు స్టార్క్ వచ్చాడు. ఆ ఓవర్ రెండో బంతిని దినేశ్ చండీమల్ భారీ సిక్స్ కొట్టాడు. ఎంత భారీ సిక్స్ అంటే.. బాల్ వెళ్లి రోడ్డుపై నడుస్తున్న ఓ కుర్రాడికి తగిలింది. మనోడు ఒక్కసారిగా కంగు తిన్నాడు. ఆ తర్వాత పక్కనున్న కుర్రాడు ఆ బాల్ ని తిరిగి గ్రౌండ్ లోకి విసిరేశాడు.
Dinesh Chandimal’s highest ever Test score 👊 pic.twitter.com/f0lGV1VqUN
— ESPNcricinfo (@ESPNcricinfo) July 11, 2022
ఈ ఓవర్ లో ఇంకో స్పెషల్ కూడా జరిగింది. అదేంటంటే.. ఆ తర్వాతి బాల్ ని కూడా చండీమల్ భారీ సిక్స్ గా మలిచి తన డబుల్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. చండీమల్ సహా శ్రీలంక బ్యాటర్లు విజృంభించడంతో ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు. రెండో టెస్టు విజయంతో శ్రీలంక సిరీస్ ను సమం చేసింది. దినేశ్ చండీమల్ డబుల్ సెంచరీ సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#SLvAUS #dineshchandimal pic.twitter.com/84Duro4bkg
— Jemi_forlife (@jemi_forlife) July 11, 2022