బేబీ ఏబీగా పేరు తెచ్చుకున్న సౌతాఫ్రికా కుర్ర క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ ఆ పేరును నిలబెట్టుకుంటున్నాడు. సౌతాఫ్రికాకు చెందిన ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడు మరోసారి తన పవర్ హిట్టింగ్ సత్తా ఏంటో చూపించాడు. కేవలం 11 బంతులు ఎదుర్కొని 34 పరుగులు చేసి దుమ్మురేపాడు. అందులోనూ వరుసగా నాలుగు సిక్సులు బాది ఔరా అనిపించాడు. ఇన్ని తక్కువ బంతుల్లోనే అంతలా రెచ్చిపోవడానికి కూడా కారణం ఉంది. అతను ఆడింది టీ20ల్లో కాదు.. అంతకంటే పొట్టి ఫార్మాట్ అయిన సిక్ట్సీలో. కేవలం 60 బంతుల ఆటలో తనకు దొరికిన 11 బంతులపై విరుచుకుపడ్డాడు. బంతి వచ్చిందే తడువుగా.. భారీ సిక్సులు బాదాడు. సిక్ట్సీ లీగ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌కు ప్రాతినిథ్యవ వహిస్తోన్న బ్రెవిస్ జమైకా బౌలర్లను చీల్చి చెండాడాడు. 11 బంతుల్లో ఏకంగా 34 రన్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్‌రేట్ ఏకంగా 309 కావడం గమనార్హం.
కాగా బ్రెవిస్ ఇలా అరివీర భయంకరంగా బ్యాటింగ్ చేసిన తన టీమ్‌కు విజయాన్ని అందించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా నిర్ణీత 60 బంతుల్లో 139 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఆల్-రౌండర్ ఫాబియన్ అలెన్ జమైకా తరపున కేవలం 18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 45 పరుగులు చేసి అదరగొట్టాడు. లక్ష్యఛేదనలో బ్రెవిస్ అదరగొట్టినా ఫలితం లేకపోయింది. కాగా డెవాల్డ్ బ్రెవిస్‌ను ముంబై ఇండియన్స్ టీమ్ ఐపీఎల్ 2022 మెగా వేలంలో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ సీజన్‌లో అతను కూడా భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. రాబోయే సీజన్‌లో బ్రెవిస్ ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడిగా మారుతాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఈ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్‌ను సౌతాఫ్రికా టీ20 లీగ్ కోసం కూడా ముంబై ఇండియన్స్ తన కొత్త ఫ్రాంచైజ్ ఎంఐ కేప్‌టౌన్‌లో కూడా తీసుకుంది.
ఈ సిక్ట్సీ ఫార్మాట్ ఏంటి..?
ఇక క్రికెట్ ప్రపంచలోకి కొత్తగా వచ్చిన ఈ అతి చిన్న ఫార్మాట్‌ను వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రవేశపెట్టింది. సీపీఎల్‌లో ఆడిన టీమ్స్‌లే ఈ సిక్ట్సీ లీగ్‌లో ఆడతాయి. ఇప్పటికే టెస్టు నుంచి వన్డేకు.. వన్డే నుంచి టీ20లకు.. అక్కడి నుంచి ది హండ్రెడ్ అంటూ వంద బంతుల ఫార్మాట్ అంటూ క్రికెట్ రూపాంతరం చెందుతూ వచ్చింది. తాజాగా సిక్ట్సీ అంటూ 60 బంతుల మ్యాచ్ వచ్చేసింది. విండీస్ బోర్డు దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టింది. పైగా ఇందులో సరికొత్త రూల్స్‌ను కూడా తీసుకొచ్చింది. క్రికెట్ అభిమానులు ఓటింగ్ ద్వారా మ్యాచ్‌లో ఏదో ఒక బంతిని ఫ్రీ హిట్‌గా నిర్ణయిస్తారు. ఆ బంతిని బ్యాటర్ అవుట్ అయితే అది నో బాల్ కాకున్నా అవుట్ ఇవ్వరు. ఇలాంటి విచిత్రమైన రూల్స్ చాలానే ఉన్నాయి ఈ టోర్నీలో. మరి టీ20 ఫార్మాట్‌లా ఈ ఫార్మాట్ కూడా సకెస్స్ అవుతుందో కాదో? చూడాలి. మరి ఈ ఫార్మాట్‌పై, ఈ ఫార్మాట్‌లో డెవాల్డ్ బ్రెవిస్ ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్! ఆ టీమ్ మెంటర్‌గా..
Dewald Brevis just casually smashing 34 (11) deliveries#6ixtyCricket pic.twitter.com/9tyWPnluwh
— Werner (@Werries_) August 25, 2022