ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం వేట మెుదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు వినిపించాయి. కానీ తాజాగా ఓ విధ్వంసకర బ్యాట్స్ మెన్ పేరు పంత్ ప్లేస్ లో వినిపిస్తోంది. మరి ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ధనాధన్ క్రికెట్ టోర్నీ ఐపీఎల్. మార్చి 31న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు పూర్తిగా సిద్ధం అయ్యాయి. అయితే కొన్ని జట్లను గాయాలు వెంటాడుతుంటే.. మరికొన్ని జట్లను దురదృష్టం వెంటాడింది. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ కారు యాక్సిడెంట్ ప్రమాదానికి గురై ఈ ఐపీఎల్ సీజన్ కు దూరం అయిన సంగతి తెలిసిందే. దాంతో ఢిల్లీ టీమ్ బలహీన పడింది. ఇక పంత్ స్థానాన్ని భర్తీ చేసే ఆ ఆటగాడి కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తెరపైకి ఎన్నో పేర్లు వచ్చినప్పటికీ అవన్నీ వార్తలుగానే నిలిచాయి. కానీ తాజాగా ఓ విధ్వంసకర బ్యాట్స్ మెన్ పేరు పంత్ ప్లేస్ లో వినిపిస్తోంది. మరి ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
రిషభ్ పంత్.. కారు ప్రమాదానికి గురికావడంతో.. ఈ ఏడాది జరిగే అన్ని మేజర్ టోర్నీలకు దూరం అయ్యాడు. ప్రస్తుతం కొద్దికొద్దిగా కోలుకుంటున్నప్పటికీ, అతడు మైదానంలో తిరిగి అడుగుపెట్టాలి అంటే సెప్టెబర్ దాకా ఆగాల్సిందే అంటున్నారు వైద్యులు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం వేట మెుదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు వినిపించాయి. ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఫిల్ సాల్ట్ మినహా మరో వికెట్ కీపర్ లేడు. దాంతో కీపర్ తో పాటుగా పంత్ లా డాషింగ్ బ్యాటింగ్ చేసే ఆటగాడి కోసం చూస్తోంది.
ఈ క్రమంలోనే ఢిల్లీకి పంత్ స్థానంలో ఓ విధ్వంసకర బ్యాటర్ దొరికినట్లు తెలుస్తోంది. అతడి పేరు మహ్మద్ అజారుద్దీన్.. కేరళకు చెందిన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. అజారుద్దీన్ తో పంత్ స్థానాన్ని భర్తీ చేయాలని ఢిల్లీ టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మహ్మద్ అజారుద్దీన్ ట్రాక్ రికార్డు విషయానికి వస్తే.. దేశవాలీ టీ20 క్రికెట్ లో ఇప్పటి వరకు 39 మ్యాచ్ లు ఆడి.. 741 పరుగులు సాధించాడు. వాటిల్లో ఓ సెంచరీతో పాటుగా రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి విధ్వంసం సృష్టించగల సత్తా అజారుద్దీన్ సొంతం.
అయితే 2022లో మహ్మద్ అజారుద్దీన్ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. కానీ ఈ సీజన్ లో అతడికి అవకాశం రాక బెంచ్ కే పరిమితం అయ్యాడు. కాగా ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఇతడిని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. ఈ క్రమంలోనే పంత్ ప్లేస్ లో అజారుద్దీన్ ను తీసుకునేందుకు ఢిల్లీ టీమ్ మేనేజ్ మెంట్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ యంగ్ కేరళ ప్లేయర్ రాకతో ఢిల్లీ పరిస్థితి మారుతుందో లేదో వేచి చూడాలి.