మరో నాలుగు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో టీమిండియాకు షాకు ల మీద షాకు లు తగులుతున్నాయి. ఇప్పటికే టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా గాయం కారణంగా వరల్డ్ కప్ కు దూరం కాగా.. బూమ్రా కంటే ముందుగానే సర్జరీ జరిగి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వరల్డ్ కప్ కు దూరం అయిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా మరో స్టార్ బౌలర్ కూడా ప్రపంచ కప్ కు దూరం అయ్యాడు. అతడే దీపక్ చాహర్.. గాయం కారణంగా నేషనల్ క్రికెట్ అకాడమీ లో చికిత్స తీసుకుంటున్న చాహర్ కు గాయం తీవ్రత తగ్గకపోవడంతో అతడు టీ20 ప్రపంచ కప్ కు అందుబాటులో ఉండడని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇక అతడి స్థానంలో ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్నాడు శార్ధుల్ ఠాకూర్. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
“గోరు చుట్టుపై రోకలి పోటు” అన్నట్లుగా తయ్యారైంది టీమిండియా పరిస్థితి. ఇప్పటికే జట్టు బౌలింగ్ వైఫల్యంతో సతమతమవుతుంటే.. అది చాలదన్నట్లుగా ఈ గాయాలు ఒకటి. టీ20 ప్రపంచ కప్ కు స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్న దీపక్ చాహర్.. సౌతాఫ్రికాతో వన్డేలో గాయపడటంతో అతడిని బెంగళూర్ లోని నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపించి చికిత్స అందిస్తున్నారు. ఇక అతడి గాయం మాని త్వరలోనే టీ20 ప్రపంచ కప్ కు అందుబాటులోకి వస్తాడనుకున్న అభిమానులకు షాక్ తగిలింది. దీపక్ చాహర్ ఇంకా ఫిట్ నెస్ లోకి రాకపోవడంతో అతడు ప్రపంచ కప్ కు అందుబాటులోకి రాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. దాంతో మహారాష్ర్ట ఆల్ రౌండర్ అయిన శార్దుల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.
ఇక శార్దుల్ ఠాకూర్ కు అడపాదడపా టీమిండియా నుంచి అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా సిరీస్ లో ఆడుతున్న అతడికి మరో అవకాశం వచ్చింది. ఠాకూర్ బౌలింగ్ తో పాటుగా అద్భుతంగా బ్యాటింగ్ ను సైతం చేయగలడు. శార్దుల్ ఠాకూర్ కెరీర్ విషయానికి వస్తే.. 8 టెస్ట్ మ్యాచ్ ల్లో 27 వికెట్లు పడగొట్టగా.. 27 వన్డేల్లో 39 వికెట్లను నేలకూల్చాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో 25 మ్యాచ్ ల్లో 9.15 ఎకానమీతో 33 వికెట్లను పడగొట్టాడు. ఐపీఎల్ లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. మరి ఆస్ట్రేలియా బౌన్సీ పిచ్ లపై ఏ మేరకు రాణిస్తాడో మరి కొన్ని రోజులు వేచిచూడక తప్పదు. ఇక గురువారం మహమ్మద్ షమీ, సిరాజ్, శార్దుల్ ఠాకూర్ లు ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్నట్లు అధికారు లు తెలిపారు.
Deepak Chahar ruled out of the T20 World Cup 2022, Shardul Thakur replaces him in reserves. (Source – Sports Tak)
— Johns. (@CricCrazyJohns) October 12, 2022