ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో ఇంగ్లండ్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సెమీస్‌లో పటిష్టమైన ఇండియాను 10 వికెట్లతో చిత్తు చేసిన ఇంగ్లండ్.. ఫైనల్లో పాక్‌పై గెలిచి.. రెండో సారి పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. అయితే.. సూపర్ 12లో ఇంగ్లండ్ జట్టులో కీ ప్లేయర్‌గా ఉన్న డేవిడ్ మలాన్, సెమీస్‌కు ముందు గాయపడ్డాడు. ఇది జట్టుకు పెద్ద దెబ్బగా అంతా భావించారు. మలాన్ లేకుండానే బరిలోకి దిగిన ఇంగ్లండ్.. సెమీస్, ఫైనల్స్‌లో దుమ్మురేపి విశ్వవిజేతగా నిలిచింది. ఆరంభంలో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఆడి.. చివర్లో సెమీస్, ఫైనల్స్‌ను మిస్ అయిన మలాన్.. ఆ కసినంతా ఆస్ట్రేలియాపై చూపించాడు. వరల్డ్ కప్ ఫైనల్‌లో భాగం కాలదనే కోపంతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
వరల్డ్ కప్ ముగిసిన తర్వాత.. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ మొదలైంది. తొలి వన్డే మ్యాచ్ గురువారం ఒవెల్ అడిలైడ్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డేవిడ్ మలాన్ ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడి సెంచరీతో కదం తొక్కాడు. 128 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో 134 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌తో టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు ఆడలేదనే బెంగను మలాన్ తీర్చుకున్నట్లు క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.
అయితే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా బౌలర్లు తొలుత వణికించారు. స్టార్క్ తన ఇన్ స్వింగర్‌తో జెసన్ రాయ్ అని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు ఆరంభంలో తడబడింది. 66 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్ జట్టును సెంచరీతో ఆదుకున్న మలాన్.. ఇంగ్లండ్‌కు 287 పరుగుల భారీ స్కోర్ అందించాడు. కనీసం 150 పరుగులు చేస్తే గొప్ప అనే స్థితి నుంచి.. ఏకంగా 300 దగ్గరికి చేర్చాడు. దీంతో ఆసీస్ ముందు 288 పరుగుల భారీ టార్గెట్ ఉంచగలిగాడు. జట్టు పరిస్థితులకు అనుగుణంగా ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన మలాన్.. చివర్లో ఫోర్లు, సిక్సులతో చెలరేగి టీ20 స్టైల్ ఇన్నింగ్స్ ఆడాడు.
A brilliant hundred from Dawid Malan helps England to post a respectable total on the board.
Can Australia chase this down?#CricTracker #DawidMalan #ODI #AUSvENG pic.twitter.com/KfSrwyQu2B
— CricTracker (@Cricketracker) November 17, 2022