ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే వార్నర్ ని ఒకానొక దశలో జట్టులోనుంచి తప్పించే ప్రయత్నం చేశారని అతని భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రేత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన విధ్వంసకర ఆటతో ప్రపంచానికి ఐపీఎల్ ద్వారా ఇండియాకి ఈ ఆసీస్ ఆటగాడు సుపరిచితమే. ఇక ఐపీఎల్ లో చాలా కాలం పాటు సన్ రైజర్స్ జట్టుకి ఆడి తెలుగు వారి అభిమానాన్ని గెలుచుకున్నాడు. కేవలం ఆటతోనే కాదు ఇక్కడి తెలుగు పాటలకు డ్యాన్స్ వేస్తూ.. సందడి చేసాడు. ఇదిలా ఉండగా..అప్పటివరకు సన్ రైజర్స్ జట్టుని బాగా లీడ్ చేస్తున్న వార్నర్ ని అనూహ్యంగా తప్పించారు. అంతే కాదు వార్నర్ తన కెరీర్ లో ఒకానొక దశలో నరకం చూశాడని తన భార్య క్యాండీస్ ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రస్తుతం వార్నర్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి కెప్టెన్ గా ఆడుతున్నాడు. ఐపీఎల్ లో 3 సార్లు ఆరెంజి క్యాప్ గెలుచున్నాడు వార్నర్. అయితే తాజాగా వార్నర్ భార్య క్యాండీస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భర్తను ఒకానొక దశలో జట్టునుండి శాశ్వతంగా తప్పించాలని చూసారని చెప్పింది. 2018 లో సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా బాల్ టాంపరింగ్ చేసిన కారణంగా ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ తో పాటిగా వార్నర్ ని కూడా ఏడాది పాటు నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మాట్లాడుతూ వార్నర్ భార్య క్రికెట్ ఆస్ట్రేలియాని దుమ్మెత్తిపోసింది. తన భర్త వార్నర్ పై క్రికెట్ ఆస్ట్రేలియా కుట్ర పన్నిందని ఆరోపణలు చేసింది.
మ్యాటీ జాన్స్ పోడ్ కాస్ట్ లో ఈమె మాట్లాడుతూ.. “సౌత్ ఆఫ్రికాలో మేము హోటల్ రూమ్ నుంచి బయటకు రాగానే డేవిడ్ ని శాశ్వతంగా తప్పించేందుకు కుట్ర జరిగింది. అప్పుడు మాకు ఏ ఒక్కరి దగ్గర నుండి సపోర్ట్ లభించలేదు. అప్పటికే మానసికంగా ఇబ్బందిపడుతున్న మాకు ఎవరూ సహాయం చేయకపోవడంతో వార్నర్ మరింతగా కృంగిపోయాడు. సాయం చేయకపోగా వార్నర్ ని టీమ్ లోకి రానీయకుండా చేయాల్సిందంతా చేశారు. ప్రతి దానికి మమ్మల్ని నిందించారు. మా దగ్గర ఉన్న బంధువులు ఈ విషయంలో మాకు అండగా నిలిచారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మాపై కక్ష సాధింపుతో మేము ఏమి మాట్లాడకుండా అలా ఉండిపోయాం. వార్నర్ ని తొలగించగానే మరో ఆటగాడిని తీసుకున్నారు. కానీ వార్నర్ మల్లి ఫామ్ అందుకొని జట్టులోకి వచ్చాడు. జార్జ్ బెయిలీ, ఆండ్రూ మెక్ డోనాల్డ్ వచ్చాక జట్టులో చాలా మార్పులు వచ్చాయి. వారి వార్నర్ కి మద్దతుగా నిలిచారు. కానీ బాల్ టాంపరింగ్ సమయంలో మేము నరకం చూసాము” అని వార్నర్ భార్య చెప్పుకొచ్చింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.