‘సూర్య భాయ్..‘ ప్రస్తుత భారత జట్టులో మరోగుతున్న పేరు ఇది. ప్రస్తుతానికి బాగానే ఉన్నా అతని గతం ఎలా ఉండేదో ఓసారి తిరగేద్దాం. ఐపీఎల్లో మంచిగా ఇస్తున్నా, భారత జట్టులో చోటు ఎందుకు దక్కేది కాదో తనకు అర్థమయ్యేది కాదు. అందుకోసం చాలా కాలమే ఎదురుచూశాడు. అలా ఐపీఎల్ 2020 తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య, నేడు కీలక ఆటగాడిగా మారిపోయాడు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. భారత జట్టులో తన పాత్ర ఏంటో తెలుసుకొని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. ఆడేది.. 20 బంతులైనా బౌలర్లకు ఆరోజు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఈ తరుణంలో సూర్యాపై మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం భీకర ఫామ్ లో ఉన్నాడు. ఆడిన తొలి బంతి నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ హి అందుకు ఉదాహరణ. మొహాలీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 25 బంతుల్లో 46 పరుగులు చేసిన సూర్య, 24 హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు సాధించాడు. ఇంత అద్భుతంగా రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్ పై, పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ప్రశంసల వర్షం కురిపించాడు.
ప్రస్తుతం సూర్య ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడని కొనియాడిన కనేరియా, రాబోవు రోజుల్లో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజాం వంటి స్టార్ ఆటగాళ్లను అధిగమిస్తాడని అభిప్రాయపడ్డాడు. “ప్రస్తుత అత్యుత్తమ బ్యాటరల్లో సూర్యకుమార్ ఒకడు. నేను గత కొంత కాలంగా ఇదే విషయాన్ని చెబుతున్నాను. మైదానంలో అతడు నలువైపులా ఆడే షాట్లు అద్భుతమైనవి. వాస్తవంగా చెప్పాలంటే.. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు వెన్నులో వణుకు పుడుతోంది. రాబోవు రోజుల్లో సూర్య ఖచ్చితంగా పెద్ద స్టార్ ఆటగాడు అవుతాడు. అతడు బ్యాటింగ్ చేసే విధానం.. ఇతర బ్యాటింగ్ దిగ్గజాలందరినీ మరచిపోయేలా చేస్తుంది”.
Do you agree with Danish Kaneria’s prediction?#SuryakumarYadav #INDvSA #IndianCricket pic.twitter.com/M9lisrQXAf
— SportsCafe (@IndiaSportscafe) September 27, 2022
విరాట్ కోహ్లీ, బాబర్ ఆజాం ఇద్దరూ గొప్ప ఆటగాళ్లే. కానీ రాబోయే రోజుల్లో సూర్య వీరిద్దరిని అధిగమించి ప్రపంచ క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించుకుంటాడు” అని కనేరియా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం సూర్య ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటిదాకా 31 టీ20 మ్యాచులు ఆడిన సూర్య ఆరు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అతడు ఎదుర్కున్న ప్రతి 6 బంతుల్లో రెండు బౌండరీకి తరలిస్తున్నాడు. ఇక, ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో సూర్య కడుపునొప్పితో భాధపడినప్పటికీ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.